పైలట్‌కు ఎరగా అమ్మాయి: రేప్ కేసు పెట్టి టోకరా

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ముగ్గురు మోసగాళ్లు తమ గర్ల్ ఫ్రెండ్‌ను ఎరగా వేసి ఓ ప్రముఖ విమాన యాన సంస్థకు చెందిన పైలట్‌ను మోసం చేశారు. పైలట్‌ను బ్లాక్ మెయిల్ చేసి దాదాపు పది లక్షల రూపాయలు దండుకున్నారు. చివరకు పైలట్ ఫిర్యాదు చేయడంతో వారిని పోలీసులు పట్టుకున్నారు.

వివరాలు ఈ విధంగా ఉన్నాయి - అడల్ట్ ఫ్రెండ్‌షిప్ వెబ్‌సైట్‌లో పైలట్‌కు ఇద్దరు మహిళలు పరిచయమయ్యారు. ఆ పరిచయానికి పైలట్ భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. రోహిణిలోని ఓ కేఫ్‌లో ఆ ఇద్దరు మహిళలను పైలట్ కలిశాడు. ఆ తర్వాత రాత్రి వారి ఫ్లాట్‌కు వెళ్లాడు.

On adult date, pilot trapped in 'rape' case

ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆ ఫ్లాట్‌లోకి వచ్చి తమను తాము క్రైమ్ బ్రాంచ్ పోలీసులుగా చెప్పుకున్నారు. మహిళలను రేప్ చేసినట్లు కేసు పెడుతామని పైలట్‌ను బెదిరించారు. మహిళలను ఇద్దరిని కూడా వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. దీంతో భయపడిన పైలట్ డబ్బుుల ఇచ్చి కేసు నుంచి బయటపడాలని భావించాడు.

మొదట వారికి అతను 20 వేల రూపాయలు ఇచ్చాడు. ఆ తర్వాత మరో లక్ష రూపాయలు ఇచ్చాడు. ఆ ముగ్గురు దాంతో సరిపుచ్చకుండా మరోసారి బెదిరించారు. దీంతో మరో 9 లక్షల రూపాయలు ఇచ్చాడు. అయితే, దాంతో సమస్య సమిసిపోలేదు. కొత్త డిమాండ్లతో వారు పైలట్‌ను వేధించడం ప్రారంభించారు.

దాంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. కాల్ డేటా ఆధారంగా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుల్లో ఇద్దరుు హోంగార్డులు జగతిందర్ సింగ్ అలియాస్ జిమ్మి, సుదర్ లాల్, జిమ్ ఇన్‌స్ట్రక్టర్ కమ్ బౌన్సర్ జితేందర్ అలియా్ ప్రిన్స్ ఉన్నారు. ఈ ముఠా దాదాపు వందిని గర్ల్ ఫ్రెండ్స్‌ను ఎరవేసి మోసగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A gang of three cheated a pilot sending two woman and collected RS 10 lakhs from the pilot, posing as police in Delhi.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి