Crop Loan Waiver: రైతులకు శుభవార్త.. ఆగస్ట్ 15న మూడో విడత రుణ మాఫీ..!
ఎన్ని ఇబ్బందులు ఉన్నా తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణ మాఫీ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం మూడు విడతల్లో రుణ మాఫీ చేస్తామని పేర్కొంది. ఇప్పటికే రెండు దఫాలుగా రుణ మాఫీ చేసింది. మొదట రూ.లక్ష లోపు వరకు రుణ మాఫీ చేయగా.. రెండో విడతలో రూ.1.50 వరకు రుణ మాఫీ చేసింది.
ఇప్పుడు మూడో విడత రుణ మాఫీకి కసరత్తు చేస్తోంది. ఆగస్ట్ 14న లేదా 15న మూడో విడత రుణ మాఫీ చేయనున్నారు. రూ.2 లక్షల లోపు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేయనున్నారు. జులై 18వ తేదీన మొదటి విడతగా లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమున్న రైతులకు ఏకకాలంలో రుణ మాఫీ చేశారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న తర్వాత మూడో విడత కు సంబంధించి నిధులు విడుల చేసే అవకాశం ఉంది.

ఖమ్మం జిల్లా వైరా మండలంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొని రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. లేకుంటే ఆగస్ట్ 15న హైదరాబాద్ లో మూడో విడత రుణ మాఫీ చేసే అవకాశం ఉంది. మూడో విడత రుణ మాఫీ అవసరమైన నిధులపై దృష్టి పెట్టింది. ఈమేరకు మూడో విడత రుణ మాఫీ కోసం నిధులను సిద్ధం చేస్తోంది. మూడో దశలో భాగంగా మరో 6 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయాల్సి ఉంది.
ఇందుకు రూ.6,000 కోట్లకు పైగా అవసరమవుతాయని అంచనా వేశారు. ఆగస్ట్ 6న బహిరంగ మార్కెట్ నుంచి ప్రభుత్వం రూ.3,000 కోట్ల అప్పును తీసుకుంది. మరో రూ.3,000 కోట్ల కోసం ఆర్బీఐ వద్ద అప్పు చేయనుంది. ఈ రోజు జరిగే ఆర్బీఐ ఈ-వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 3 వేల కోట్ల అప్పును తీసుకోనుంది. ఆగస్ట్ 15తో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణ మాఫీ హామీ ముగియనుంది.












Click it and Unblock the Notifications