• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రమ్య మృతి ఎఫెక్ట్: ఒకేరోజు 269 మంది మైనర్లు, బతిమాలిన పేరెంట్స్

|

హైదరాబాద్: లైసెన్స్‌ లేకుండా, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనం నడిపితే జైలుకు వెళ్లాల్సిందే. వాహనాన్ని కూడా ఇవ్వరు. కోర్టుకు వెళ్లవలసి ఉంటుంది. జరిమానాతో మాత్రం వదిలి పెట్టరు. లైసెన్స్‌ లేని వారికి వాహనం ఇచ్చిన వారిపైనా కేసు నమోదవుతుంది.

చిన్నారి రమ్య మృతి అనంతరం పోలీసులు భద్రత పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపితే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ముఖ్యంగా మైనర్లు ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారని, వారి దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ట్రాఫిక్‌ పోలీసులు శ్రీకారం చుట్టారు.

బుధవారం పట్టుబడిన 269 మంది మైనర్లకు తల్లిదండ్రుల సమక్షంలో బేగంపేటలోని టాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో గురువారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కార్యక్రమానికి హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ జి జితేందర్‌ పాల్గొన్నారు.

తాను 25 ఏళ్లుగా ప్రసంగాలు చేస్తున్నానని చెప్పాడు. కానీ ఎప్పుడు కూడా తీవ్రవాదాన్ని సమర్థించలేదని చెప్పాడు. నా పైన విమర్శలు చేసే వారికి తాను గతంలో మాట్లాడిన దానికి సంబంధించిన పెన్ డ్రైవ్‌లు పంపిస్తానని చెప్పాడు.

వాటి ద్వారా తాను ఎలాంటి తప్పు చేయలేదని తెలుస్తుందన్నాడు. ఇస్లాంలో సూసైడ్ బాంబులకు అనుమతి లేదన్నాడు. అమాయక ప్రజలను చంపాలని ఇస్లాం చెప్పదని తెలిపాడు. చంపడం తప్పని చెప్పాడు.

ట్రాఫిక్ ఉల్లంఘన

ట్రాఫిక్ ఉల్లంఘన

తొలుత రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రమ్యకు నివాళి అర్పిస్తూ పోలీసులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ట్రాఫిక్‌ నియమాలు, భద్రత, ప్రాణం విలువ తదితర అంశాలపై తల్లిదండ్రులు, పిల్లలకు అవగాహన కల్పించారు.

ట్రాఫిక్ ఉల్లంఘన

ట్రాఫిక్ ఉల్లంఘన

జీవితం ఎంతో విలువైనదని, జీవితాన్ని వృథాగా చేసుకోవద్దని, ట్రాఫిక్‌ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని చాలామంది అనుకుంటుంటారుని, అది ఇబ్బంది కాదని, మీ భద్రత గురించి మేం తీసుకుంటున్న జాగ్రత్తలు అని, అందులో భాగంగానే తనిఖీలు నిర్వహిస్తున్నామని, సహకరించాలని, రూల్స్‌ బ్రేక్‌ చేస్తే వీఐపీలైనా విడిచి పెట్టమని, లైసెన్స్‌ లేని వారికి వాహనాన్ని ఇచ్చిన వారిపై కూడా కేసు నమోదు చేస్తామని ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ హెచ్చరించారు.

 ట్రాఫిక్ ఉల్లంఘన

ట్రాఫిక్ ఉల్లంఘన

కొంతమంది చిన్నారులు లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడుపుతున్నారని, తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. డబ్బు గల పిల్లలు స్పోర్ట్స్‌ కారుల్లో రయ్‌ రయ్‌ మంటూ దూసుకెళుతున్నారని, వారిని ఆపటానికి ప్రయత్నిస్తే మరింత వేగంగా వెళుతున్నారన్నారు.

ట్రాఫిక్ ఉల్లంఘన

ట్రాఫిక్ ఉల్లంఘన

తనకు ఇద్దరు పిల్లలని, వారికి వాహనం నడపడం వచ్చనుకుంటున్నారని, రాదని తన అభిప్రాయమని అందుకే లైసెన్స్‌ తీసుకోలేదని చెప్పారు. ఏడాదికి రెండు వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటూ నివేదికలు చెబుతున్నాయన్నారు. అందులో 380పైనే మరణాలు ఉంటున్నాయన్నారు. అందులే యువకులే ఎక్కువగా ఉండటం బాధాకరమన్నారు.

 ట్రాఫిక్ ఉల్లంఘన

ట్రాఫిక్ ఉల్లంఘన

హైదరాబాదులో 70 శాతం ద్విచక్ర వాహనాలు ఉన్నాయని, 50శాతం ప్రమాదాలు ద్విచక్ర వాహనాలతోనే జరుగుతున్నాయన్నారు. కేసులు నమోదైతే విద్యార్థుల భవిష్యత పాడైపోతుందనే ఉద్దేశంతో కౌన్సెలింగ్‌ ద్వారా మార్పు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుత పిల్లలకు అన్ని విషయాలు తెలుసని, తల్లిదండ్రులు గైడ్‌ చేస్తే సరిపోతుందన్నారు. హెల్మెట్ పెట్టుకోవాలన్నారు.

 ట్రాఫిక్ ఉల్లంఘన

ట్రాఫిక్ ఉల్లంఘన

కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్‌ ధరించాలన్నారు. హైవేలపై వాహనాల వేగం ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో ప్రమాదం జరిగితే ప్రాణాలుపోతాయన్నారు. శరీరంలో తల, ఛాతి భాగాలు చాలా కీలకమన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఆ భాగాలకు గాయాలైతే కోలుకోవడం చాలా అరుదు అన్నారు. వీఐపీలు కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీటు బెల్ట్‌ పెట్టుకోకపోవడం వల్లే మరణించారని గుర్తు చేశారు.

ట్రాఫిక్ ఉల్లంఘన

ట్రాఫిక్ ఉల్లంఘన

తమ పిల్లలు చేసింది తప్పేనని, వారు ప్రమాదాలు చేయకపోయినా, భవిష్యత్తులో చేస్తారనే ముందు జాగ్రత్తతో మళ్లీ పట్టుకుంటున్నారని, కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని, దానిని తాము అంగీకరిస్తున్నామని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు.

 ట్రాఫిక్ ఉల్లంఘన

ట్రాఫిక్ ఉల్లంఘన

తాము స్నానం చేస్తున్నప్పుడో, తింటున్నప్పుడు, స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడో బండి తాళాలు తీసుకొని రైడ్‌కు వెళ్తున్నారని, జరిమానా రూ.వెయ్యికి పైగా వేస్తున్నారని, తొలి తప్పుగా భావించి జరిమానాను తగ్గించాలని తల్లిదండ్రులు ోరారు.

English summary
Over 200 minors were caught driving on Thursday as Hyderabad police intensified its efforts to make the city's roads safe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X