కళాశాలకు రాలేదని విధ్యార్థినులను గదిలో నిర్భందించిన అధ్యాపకుడు

ఖమ్మం :ఒక్క రోజున కాలేజీకి రానందుకు ఓ అద్యాపకుడు విధించిన శిక్ష ఆ విధ్యార్థినుల పాటిట శాపంగా మారింది.వంద మంది విధ్యార్థినులను ఖైదీల్లో తరగతి గదిలో వేసి నిర్భందించిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకొంది.ప్యాన్లు, గాలి వెలుతురు లేకుండా చేశారు.కిటీకీలు సైతం మూసి వేశాడు.విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు ఈ ఘటనతో విధ్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

దీపావళి పర్వదినం ఈ ఏడాది ఆదివారం నాడు వచ్చింది. పండుగ మరునాడే కళాశాలకు రాకపోవడమే విధ్యార్థినులు చేసిన తప్పు.పండుగ మరునాడే కాలేజీకి రాని వారి సంఖ్య అన్ని విభాగాల్లో కలిపి సుమారు వంద మంది వరకు తేలారు.ఈ వంద మందికి ఆ అధ్యాపకుడు ఈ కఠినమైన శిక్ష విధించాడు.

one day without permission holiday, inhuman punishment over students

పండుగ మరునాడే కాలేజీకి రాని విధ్యార్థినులందరినీ ఒకే గదిలో నిర్భందించాడు ఆ ప్రబుద్దుడు గాలి , వెలుతురు రాకుండా చేశాడు ,విద్యుత్ ను నిలిపివేశాడు. కిటీకీలు కూడ బిగించడంతో కొందరు విద్యార్థినులు స్పృహా తప్పిపోయారు. ఒక విధ్యార్థిని కిందపడి గాయాలపాలైంది.స్థానికంగా ఉన్న వైద్యుడిని తీసుకు వచ్చి అస్వస్థతకు గురైన విధ్యార్థినులకు చికిత్స చేసి పంపినట్టు ఒక ప్రముఖ తెలుగుదినపత్రిక కథనాన్ని ప్రచురించింది.

అయితే కింద పడి తలకు గాయమైన కరుణగిరి అనే విధ్యార్థిని ఇంటికి వెళ్తూ కూడ కిందపడిపోయింది. తల్లిదండ్రులు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.విధ్యార్థినుల పట్ల అమానవీయంగా వ్యవహారించిన అద్యాపకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విధ్యార్థినుల తల్లిదండ్రులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+