మక్కాలో 13మంది భారతీయులు మృతి: హైద్రాబాద్ మహిళ కూడా, రోదనలు
హైదరాబాద్: మక్కాలో జరిగిన తొక్కిసలాటలో హైదరాబాదులోని ఎల్బీనగర్‌కు చెందిన జానీబీ అనే మహిళ మృతి చెందింది. ఈమె సెప్టెంబర్ 2వ తేదీన మరో ముగ్గురితో కలిసి హజ్ యాత్రకు వెళ్లింది. అయితే, గురువారం నాటి తొక్కిసలాట ఘటనలో జానీబీ మృతి చెందింది.
ఆమెతో పాటు వెళ్లిన మిగతా ముగ్గురు క్షేమంగా ఉన్నారు. జానీబీ మృతి చెందిన విషయం తెలియగానే ఎల్బీ నగర్‌లోని ఆమె నివాసంలో విషాధచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోదిస్తున్నారు.
ఇదిలా ఉండగా, తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారిలో 13 మంది భారతీయులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశానికి చెందిన, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి గురించి పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది.

మక్కా ఘటనపై సమీక్షిస్తున్నాం: భారత విదేశాంగ శాఖ
మక్కాలో జరిగిన ఘోర ప్రమాదంపై సమీక్షిస్తున్నామని.. వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అంతకుముందు వెల్లడించింది. ఇప్పటివరకు మృతులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియలేదని పేర్కొంది.
మక్కాలో భారతీయుల పరిస్థితికి సంబంధించి ఆరా తీస్తున్నామని, నిరంతరం సమాచారం తెలుసుకుంటున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. ఈ ఏడాది హజ్ యాత్రకు భారత్ నుంచి 1.50 లక్షల మంది వెళ్లారు. మక్కాలో తొక్కిసలాట జరిగి 300 మందికి పైగా మృతి చెందగా, 450 మంది క్షతగాత్రులయ్యారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
ఓ హైదరాబాదీ, జునాబీ మదతి, రెండున హాజ్ యాత్రకు, వెలలింది, నలుగురిలో జూనిబి మృతి, మిగిలన వారు క్షేమం, మక్కా తోక్కిసలాటలో 13 మంది భారతీయులు మృతి, ఎల్బీ నగర్ కు చెందిన జానిబీ, మక్కా ప్రమాదంలో సెప్టెంబర్ 2న నలుగురు మక్కాకు, నలుగురిలో ముగ్గురు క్షేమం,












Click it and Unblock the Notifications