కవితపై అనుచిత వ్యాఖ్యలు: తీన్మార్ మల్లన్నపై మరో కేసు
తీన్మార్ మల్లన్నపై మరో కేసు నమోదైంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో శ్రీకాంత్ అనే యువకుడు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: తీన్మార్ మల్లన్నపై మరో కేసు నమోదైంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో శ్రీకాంత్ అనే యువకుడు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. ఈడీ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కించపరిచేలా మల్లన్న వ్యాఖ్యలు చేశాడని ఫిర్యాదులో శ్రీకాంత్ పేర్కొన్నాడు.
ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని శ్రీకాంత్ ఫిర్యాదుతో మల్లన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. తీన్మార్ మల్లన్నతోపాటు బ్రహ్మి ట్రోల్స్ నిర్వాహకులపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఈ కామెంట్స్ ను బ్రహ్మీట్రోల్స్ అనే యూట్యూబ్ ఛానల్‌లో వాడారని.. ఆ క్లిప్పింగ్ ఆధారంగా శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇప్పటికే ఎస్ఓటీ పోలీసులపై దాడి కేసులో మల్లన్నతోపాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో న్యాయస్థానం వీరికి 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా, మేడిపల్లి పోలీస్ స్టేషన్లో తీన్మార్ మల్లన్నపై రెండు కేసులు నమోదయ్యాయి.
కాగా, ఇటీవల కొందరు దుండగులు తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీనిపై తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత పోలీసులు తీన్మార్ మల్లన్న కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. పలు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్నతోపాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications