Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహిళలకు తులం బంగారం హామీ.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ళు, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ వంటి పథకాలను అందిస్తోంది.

మహిళలకు తులం బంగారం హామీపై ప్రతిపక్షాల టార్గెట్

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒకటైన కళ్యాణలక్ష్మితో పాటు, తులం బంగారం హామీ ఇప్పటికీ నెరవేరలేదు. ప్రభుత్వం కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ప్రతిసారి, ప్రతిపక్షాలు తులం బంగారం హామీ పైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా మహిళలకు ఇస్తామని చెప్పిన తులం బంగారం హామీని ఇప్పటివరకు నెరవేర్చలేదని పదేపదే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు.

One Tula of Gold Guaranteed for Women telangana Minister Sridhar Babu Makes Key Announcement

రేవంత్ రెడ్డికి ఆరు గ్యారెంటీల అమలుపైన సవాల్

ఈ క్రమంలోనే బిజెపి నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆరు గ్యారెంటీల అమలుపైన సవాల్ విసిరారు. దీనికి స్పందించిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో ఎక్కువ భాగం ఇప్పటికే అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మిగిలిన హామీలను కూడా త్వరలోనే అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

త్వరలోనే తులం బంగారం హామీ అమలు చేస్తామన్న శ్రీధర్ బాబు

ముఖ్యంగా తులం బంగారం హామీలు కూడా త్వరలోనే అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. తమ ఐదేళ్ల పదవీకాలం ముగిసే లోపు అన్ని హామీలను నెరవేరుస్తామని, ఆ తర్వాత ప్రజల వద్దకు వెళదామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ 420 హామీలు అంటూ ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు 100శాతం నేరవేరుస్తాం

ప్రజలను ఏవిధంగా పక్కదారి పట్టించాలో బి ఆర్ ఎస్ కు బాగా తెలుసని ఆయన విమర్శలు చేశారు. తాము చాలా వాస్తవికంగా ఉంటూ, ఆచరణ యోగ్యమైన హామీలు, పథకాలను ప్రజల కోసం అమలు చేస్తామని పేర్కొన్నారు. కొంత జాప్యం జరిగినప్పటికీ ఇచ్చిన అన్ని హామీలను 100% నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సీనియర్ మంత్రులకు మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి శ్రీధర్ బాబు కొట్టిపారేశారు.

తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంలు!
తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంలు!

తాము చేస్తున్న అభివృద్ధి ఓర్వలేక ప్రతిపక్షాల విమర్శలు

రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళుతుందన్నారు. తాము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్చుకోలేక ప్రతిపక్షాలు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షులుగా తాను ఉన్నానన్న ప్రచారం పైన స్పష్టత ఇచ్చిన ఆయన, బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ పార్టీని సమర్థవంతంగా నడిపిస్తున్నారు అంటూ ప్రశంసించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+