oneindia exclusive: మేడారం జాతర; చిలకలగుట్టపై సమ్మక్క రహస్యం!!
మేడారం మహా జాతర సమ్మక్క ఆగమనంతో తారస్థాయికి చేరుకుంటుంది. అయితే చిలకలగుట్ట పై నుండి సమ్మక్కను గద్దెల మీదకు తీసుకు వచ్చే వేడుక కన్నుల పండుగగా, ఎంతో ఉద్విగ్నంగా కొనసాగుతుంది. మేడారం జాతరలో చిలకలగుట్ట కు ఒక ప్రముఖమైన స్థానం ఉంది.
Recommended Video

అసలు చిలకలగుట్ట పైన సమ్మక్క ఎక్కడ ఉంటారు? ఎందుకు ఎవరూ చిలకలగుట్ట పైకి వెళ్లే సాహసం చేయరు? చిలకలగుట్ట పైన కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క కు సంబంధించిన రహస్యాన్ని సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ వన్ ఇండియాకు ఎక్స్ క్లూజివ్ గా వివరించారు.

మేడారం మహా జాతర లో భాగంగా మాఘశుద్ధ పౌర్ణమి నాడు చిలకలగుట్ట పై నుండి సమ్మక్కను అధికార లాంచనాలతో, ఉన్నతాధికారులు తుపాకీలతో గాలిలో కాల్పులు జరిపి సాదరంగా స్వాగతిస్తారు. అమ్మవారిని తీసుకురావడానికి వెళ్ళే సమ్మక్క పూజారులు పూర్తిగా అమ్మవార్లను ఆవాహనం చేసుకున్న వారిగా మారిపోతారు. ఎవరితోనూ మాట్లాడరు.. ఎవరు చెప్పింది వినరు. అక్కడ అధికారులైనా, మంత్రులైనా, అందరూ వారికి సమానమే.
రెండేళ్లకు ఒకసారి చిలకలగుట్ట పైకి సమ్మక్క పూజారులు మాత్రమే వెళ్లి అమ్మవారిని తీసుకువస్తారు. మళ్లీ రెండేళ్ల వరకు గుట్ట ప్రాంతం అంతా నిషేధిత ప్రాంతంగా ఉంటుంది. అక్కడికి ఎవరూ వెళ్లే సాహసం చేయరు. అమ్మవార్లను తీసుకువచ్చే పూజారులు కూడా అక్కడకు వెళ్లలేరు.
ఇక ఇదే విషయాన్ని సిద్దబోయిన అరుణ్ వన్ ఇండియా తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ రెండేళ్లకు ఒకసారి మాత్రమే, మాఘ శుద్ధ పౌర్ణమి నాడు అమ్మవారిని తీసుకువచ్చే క్రమంలో, వారం రోజులపాటు అమ్మవారిని ఆవాహనం చేసిన తమకు చిలకలగుట్ట పై మార్గం కనిపిస్తుందని, మిగతా రోజుల్లో ఎవరికి ఆ మార్గం కనిపించదని.. ఇదే చిలకలగుట్ట పై సమ్మక్క అసలు రహస్యం అని చెబుతున్నారు.
చిలకలగుట్ట పై అమ్మవారిని చేర్చే ప్రాంతం ఆ సమయంలో తప్ప, మిగతా సమయాల్లో తమకు గుర్తు ఉండదని, మాఘ శుద్ధ పౌర్ణమి నాడు తమకు అమ్మవారే బాటను చూపిస్తారని చెబుతున్నారు. ఇప్పటివరకు ఎవరు చిలకలగుట్ట పై అమ్మవారు ఎక్కడ ఉంటారో చెప్పలేకపోయారని, జాతర సమయంలో తప్ప, మిగిలిన సమయాల్లో తాము కూడా అక్కడకు చేరుకోలేమని చెబుతున్నారు.
ఒకవేళ ఎవరైనా గిరిజన సాంప్రదాయాలను, నియమ నిష్టలను తప్పి అక్కడికి వెళ్లాలని ప్రయత్నస్తే వారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొని, ఎలాంటి ఫలితం లేకుండా తిరిగి రావాల్సిందేనని సిద్దబోయిన అరుణ్ చెబుతున్నారు. ఎంతో మహిమ ఉన్న సమ్మక్క తల్లి గిరిజనులే కాకుండా గిరిజనేతరులను కూడా తన మహిమతో కాపాడుతుందని చెప్పడానికి కోట్లాదిగా వచ్చే భక్తజనమే నిదర్శనమని సమ్మక్క పూజారి అరుణ్ వెల్లడించారు. చిలకలగుట్ట యొక్క అసలు రహస్యాన్ని, అమ్మవారి మహత్యాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications