సక్సెస్ తోనే సమాధానం - ఏకైక రాష్ట్రంగా తెలంగాణ..!!

విద్యుత్ రంగంలో ఆదర్శంగా నిలుస్తోంది తెలంగాణ. వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్​ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలుస్తోంది.

మాటకు మాట సమాధానం కాదు. విమర్శలకు చేతలతోనే సమాధానం. తెలంగాణ కొత్త రాష్ట్రంలో పలు కీలక రంగాల్లో ఆచరణాత్మక నిర్ణయాలతోనే విమర్శకులకు సమాధానం దొరికింది. పక్కా ప్రణాళిక..అంకిత భావం ఉంటే ఏదైనా సాధించవచ్చని ప్రభుత్వం నిరూపించింది. తెలంగాణ ఏర్పడితే అంధకారం తప్పదని నాటి విమర్శలు. నేడు దేశంలో విద్యుత్ సంస్కరణలను తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా తో కొత్త చరిత్ర లిఖించింది. వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్​ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. విద్యుత్ వినియోగంలోనూ అదే స్థానం. రాష్ట్ర విద్యుదుత్పత్తి సామర్థ్యం 18,453 మెగావాట్లుకు చేరుకుంది. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలనే కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. పెరుగుతున్న సాగు విస్తీర్ణం.. పారిశ్రామిక ఉప్పత్తితో విద్యుత్ వినయోగం పీక్ కు చేరింది.

ఆ స్థానం నుంచి నేడు నెంబర్ 1 రాష్ట్రంగా

ఆ స్థానం నుంచి నేడు నెంబర్ 1 రాష్ట్రంగా

తెలంగాణ ఏర్పాటు సమయంలో విద్యుత్ పరిస్థితిపైన నాటి పాలకులు అనేక కామెంట్లు చేసారు. తెలంగాణ విద్యుత్ ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నించారు. చీకట్లు తప్పవని భయపెట్టే ప్రయత్నం చేసారు. కానీ, క్రమేణా తెలంగాణలో అమలయిన విద్యుత్ సంస్కరణలు..సరఫరా.. ఏకంగా 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో నాటి విమర్శలు అడ్రస్ లేకుండా పోయారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో రాష్ట్రంతో ,స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 7,778 మెగా వాట్లు. నేటి సామర్ద్యం ఏకంగా 18,453 మెగా వాట్లకు చేరింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్​ రంగ బలోపేతం కోసం, కరెంటు సరఫరా, పంపిణీ వ్యవస్థలను మెరుగుపర్చడం కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు రూ 38,070 కోట్లు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొంటూనే, అవసరమైన మేర కొనుగోలు చేస్తూ, ఇవ్వాళ కరెంటు మిగులు రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారు. ఎలాంటి విద్యుత్‌ కోతలు లేకుండా, పవర్‌ హాలీడేలకు స్వస్తి పలికి, నాణ్యమైన కరెంటును 24 గంటల పాటు నిరంతరాయంగా అందిస్తున్నారు. ఇవ్వాళ దేశంలో 24 గంటల కరెంటు.. వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్​ను సరఫరా చేస్తున్న అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.

జాతీయ తలసరి వినయోగం కన్నా 69 శాతం ఎక్కువగా..

జాతీయ తలసరి వినయోగం కన్నా 69 శాతం ఎక్కువగా..

రాష్ట్రం ఏర్పాటు జరిగిన తొలి ఏడాది 2014-15లో తలసరి విద్యుత్ వినియోగం 1,35 యూనిట్లు మాత్రమే ఉండేది. 2021-22 కాలానికి అది 2,26 యూనిట్లకు చేరింది. ఇదే సమయంలో జాతీయ సగటును పరిశీలిస్తే 1,255 యూనిట్లుగా ఉంది. జాతీయ తలసరి వినయోగం కంటే 69 శాతం ఎక్కువగా నమోదైంది. రాష్ట్రం ఏర్పాటు అయిన తొలి నాళ్లల్లో సోలార్ పవర్ కేవలం 74 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యేది. ఇప్పుడు 5.741 మెగా వాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలతో ఇది సాధ్యమైంది. భద్రాద్రిలో 1080 మెగావాట్ల సామర్ధ్యంతో నాలుగు యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైంది. కొత్తగూడెంలో 800 మెగావాట్ల ఉత్పత్తి అందుబాటులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా జైపూర్ లో 1200 మెగావాట్ల సామర్ధ్యంతో సింగరేణి నిర్మించిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోనూ ఉత్పత్తి ప్రారంభించారు. నల్గొండ జిల్లా దామరచర్లలో టీఎస్ జెన్ కో నిర్మిస్తున్న నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.

భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్ - కారణాలివే

భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్ - కారణాలివే

రాష్ట్రంలో రోజు రోజుకు విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. సాగు విస్తీర్ణ పెరుగడంతోపాటు పారిశ్రామిక అసవరాలు పెరిగిన నేపథ్యంలో ఫిబ్రవరి10,2023 తో పోల్చితే ఫిబ్రవరి 11,2023 రోజున 14 వేల 500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. ఈ సారి వేసవిలో కూడా 15 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ అవసరముందని విద్యుత్ అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్నది వేసవి కాలంగా కాబట్టి సాగు విస్తీర్ణంతోపాటు గృహ అవసరాలకు సంబంధించి విద్యుత్ వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు ఇటు తెలంగాణ డిస్కంలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇక, కేంద్రం తీసుకొచ్చిన మీటర్లకు మోటార్లను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. వ్యవసాయం..పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న నిరంతర విద్యుత్ తో రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు కీలక రంగాల్లోనూ కొత్త రికార్డులను లిఖిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+