హైదరాబాద్ కు మరో అరుదైన గుర్తింపు - దేశంలో రెండో స్థానంలో..!!

హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంటోంది. ఊహించని విధంగా విస్తరిస్తున్న హైదరాబాద్(Hyderabad) నగరం ఇప్పటికే పలు రంగాల్లో స్థానం సుస్థిరం చేసుకుంది. ఐక్య రాజ్య సమితి (యూఎస్‌ స్టాటిస్టికల్‌ విభాగం) (UN Statistical wing)ఇదవరకు నిర్వహించిన సర్వేలో బెస్ట్‌ లివింగ్‌ సిటీగా, ఇన్వెస్ట్‌మెంట్‌ విభాగంలో సేఫెస్ట్‌ సిటీ(safest City)గా ప్రతిష్టను దక్కించుకున్న మన హైదరాబాద్‌ మహానగరం తాజాగా భద్రత అంశంలోనే దశంలో రెండో స్థానం)Second Place)లో నిలిచింది.

అరుదైన గుర్తింపు:హైదరాబాద్ నగరానికి అరుదైన గుర్తింపు దక్కింది. విశ్వనగరం వైపు విస్తరిస్తున్న హైదరాబాద్‌ చాలా భద్రమని యూఎస్‌ స్టాటిస్టికల్‌ సర్వే తేల్చి చెప్పింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత..బీఆర్ఎస్ ప్రభత్వం (BRS Govt) హైదరాబాద్ లో శాంతి భద్రతల పర్యవేక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది.

Opinion: Hyderabad is ranked second as the safest city as US Stasticial wing survery latest report

ఎటువంటి సందర్భాల్లోనూ లా అండ్ ఆర్డర్ కు విఘాతం లేకుండా చర్యలు తీసుకుంది. దీంతో, ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో పెట్టుబడులే కాదు.. అత్యంత పటిష్టమైన భద్రత గల నగరాల్లో తెలంగాణ రాష్ట్ర(Telangana State) రాజధానికి ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కింది. హైదరాబాద్‌ నగరం చుట్టూ 380 కిలోమీటర్ల పరిధిలో చీమ చిటుక్కుమన్నా ఇట్టే పట్టేసే విధంగా నిఘా వ్యవస్థను పటిష్టం చేసిన నేపథ్యంలో దేశంలోనే రెండు టాప్‌ సిటీల్లో ఒకటిగా నిలిచింది. విశ్వవ్యాప్తంగా తొలి 50 నగరాల జాబితాలో హైదరాబాద్‌(Hyderabad) 41వ స్థానంలో నిలిచింది.

దేశంలోనే రెండో స్థానంలో :అత్యుత్తమ సర్వేలైన్స్‌(Survey lines) వ్యవస్థను కలిగిన తొలి 20 జాబితాలో చైనాలోని పలు నగరాలు అత్యంత కీలకమైనవి కాగా, ఉత్తమ 50 నగరాల్లో భారత్‌ నుంచి ఢిల్లీ 22, హైదరాబాద్‌ 41వ స్థానంలో నిలిచాయి. అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన పర్యవేక్షణ వ్యవస్థను కలిగిన నగరాల జాబితాను ప్రముఖ అధ్యయన సంస్థ వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ (యూన్‌ గుర్తింపు పొందిన సంస్థ) వెల్లడించింది.

జనాభా, సీసీ కెమెరాలు, నగర విస్తీర్ణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఈ జాబితాలో హైదరాబాద్‌కు ఉత్తమ స్థానం దక్కింది. ఈ నివేదికలో పలు అంశాలను వెల్లడించారు. హైదరాబాద్‌(Hyderabad)లో ప్రతీ వెయ్యి మంది నివాసితులకు 36.52 కెమెరాలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఈ జాబితాలో మొదటి స్థానంలో 117 సీసీ కెమెరాలతో చైనా దేశంలోని టైయావున్‌ నగరం ఉంది.

Opinion: Hyderabad is ranked second as the safest city as US Stasticial wing survery latest report

ప్రపంచ స్థాయిలో గుర్తింపు:ఇండియాలోని ఇండోర్‌ 64.4 కెమెరాలతో నాలుగవ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా 33.73 కెమెరాలతో రాజధాని ఢిల్లీ(Dehli) 16వ స్థానంలో ఉంది. హైదరాబాద్ లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(Command Control Center) అందుబాటు-లోకి వచ్చిన తర్వాత నిఘా మరింత పటిష్టమైంది.

నగరంలోని 10 లక్షల కెమెరాలు కమాండ్‌ కంట్రోల్‌తో అనుసంధానం చేశారు. నగరంలో అదనంగా 5.80 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం 10 లక్షల కెమెరాలను కంట్రోల్‌లోకి చేశారు. దీంతో అడుగడుగూ సీసీ కెమెరాలో నిఘాలోకి వెళ్లింది. ఇప్పుడున్న మన హైదరాబాద్‌ మహానగరం దేశానికి ఆదర్శంగా నిలిచే కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను కలిగిఉంది. టాప్‌ 20 నగరాల్లో ఇండియా నుంచి మూడు నగరాలు ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+