వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మజ్లిస్ వర్సెస్ కిషన్: ఓయు మంట ఇలా..(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల మధ్య బుధవారం రాత్రి చోటు చేసుకున్న చిన్న వివాదం పరస్పర దాడులు, హాస్టల్‌ గదుల దహనాలకు దారితీయడంతో ఓయూలో గురువారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో క్యాంపస్‌లోని పలు హాస్టళ్లు, వివిధ కూడళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఓయూకు రావడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. దాడులకు సంబంధించి ఇరువర్గాల విద్యార్థి సంఘాల నాయకులపై కేసులు నమోదు చేశారు. ఓయూలో బుధవారం నిరుద్యోగ జేఏసీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొనలేదంటూ ఓ విద్యార్థిపై కొందరు దాడి చేశారు. ర్యాలీలోనే విద్యార్థుల రాజీ కుదుర్చుకున్నారు.

పగలు జరిగిన దాడి నేపథ్యంలో కొందరు విద్యార్థులు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఓల్డ్‌ పీజీ హాస్టల్‌కు చర్చల కోసం వెళ్లగా అక్కడ ఇరువర్గాలకు చెందిన విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగి కళ్యాణ్‌ అనే ఏబీవీపీ విద్యార్థి గదిని తగులబెట్టారు. దీనికి నిరసనగా కొందరు తెలుగు పరిశోధనా విద్యార్థి గదిని తగులబెట్టారు. ఈ నేపథ్యంలో గురువారం క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో భారీగా పోలీసు బలగాలను దింపారు.

ఓయు

ఓయు

సంఘటన జరిగిన ఓల్డ్‌ పీజీ హాస్టల్‌ను ఓయూ రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ ప్రతాప్ రెడ్డి, స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ డీన్‌ లక్ష్మయ్య, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కృష్ణారావు సందర్శించి పరిస్థితి తెలుసుకున్నారు.

ఓయు

ఓయు

దళిత విద్యార్థులపై జరిగిన దాడి వెనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాస్తం ఉందంటూ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశాయి. తమ పార్టీకి చెందిన పరిశోధనా విద్యార్థి గదిని కొందరు తగులబెట్టారన్న విషయాన్ని తెలుసుకున్న నలుగురు మజ్లిస్ ఎమ్మెల్యేలు గురువారం ఓయూకు వచ్చారు. వీరిని క్యాంపస్‌లోకి రానివ్వొద్దంటూ ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకుని ఓయూ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిపై సెక్షన్‌ 151 కింద కేసు నమోదు చేశారు.

ఓయు

ఓయు

ఇరువర్గాలకు విద్యార్థుల ఫిర్యాదుల మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి.

ఓయు

ఓయు

ఏబీవీపీ గుండాలతో కిషన్ రెడ్డి తనపై దాడి చేయించాడని తెలుగు పరిశోధనా విద్యార్థి ఆరోపించారు. తాను ఆయనపై అంబర్‌పేట నియోజకవర్గంలో మజ్లిస్ నుంచి పోటీ చేసినప్పటి నుంచి తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.

ఓయు

ఓయు

కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఉద్యమంలో పాల్గొంటున్న విద్యార్థులను భయపెట్టేందుకు ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగమే ఈ దాడులని నిరుద్యోగ జేఏసీ పేర్కొంది.

ఓయు

ఓయు

దాడుల వెనుక అసాంఘిక శక్తుల ఉన్నాయని నిరుద్యోగ జేఏసీ ఆరోపించింది. దళిత బహుజనవాదాన్ని అంతం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు అన్నారు.

ఓయు

ఓయు

దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని బీవీఎస్‌, పీడీఎస్‌యూ, టీవీఎస్‌, టీవీవీ సంఘాల నాయకులు ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

ఓయు

ఓయు

దళితుల పైన దాడి చేయిస్తున్న కిషన్ రెడ్డి ఖబడ్దార్.. అంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఓ విద్యార్థి సంఘం ర్యాలీ తీస్తున్న దృశ్యం.

ఓయు

ఓయు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట ఓ విద్యార్థి సంఘం నాయకులు గురువారం దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న దృశ్యం.

ఓయు

ఓయు

నలుగురు మజ్లిస్ ఎమ్మెల్యేలు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రావడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు.

English summary
Battle for political supremacy on the Osmania University campus has turned ugly after the formation of the Telangana State. OU students, who played a crucial role in Telangana movement, are now engaged in fierce political battle with each student group trying to gain an upper-hand over the others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X