సికింద్రాబాద్ వందే భారత్, దురంతో రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక..!!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవి నేటి నుండి అమలులోకి వచ్చాయి. ఇకపై టికెట్ బుక్ చేసేటప్పుడు OTP (వన్ టైమ్ పాస్‌వర్డ్) తప్పనిసరి అవుతుంది. ఓటీపీ ధృవీకరణ తర్వాత మాత్రమే బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. పశ్చిమ రైల్వే ఈ నిబంధనను అమలులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసిన రైళ్లల్లో ప్రవేశపెట్టింది. క్రమంగా దేశంలోని అన్ని రైల్వే జోన్లకు ఈ విధానాన్ని విస్తరిస్తోంది.
తత్కాల్ టికెట్ల బుకింగ్ లో చోటు చేసుకుంటోన్న దుర్వినియోగాన్ని అరికట్టడం, ప్రయాణం చేయాలనుకునే వారికి మాత్రమే అందుబాటులో ఉండేలా చూడటమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం. అప్పటికప్పుడు ప్రయాణించాలనుకునే వారికి టిక్కెట్లు లభించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించిన రైల్వే బోర్డు.. ఈ ఓటీపీ ఆధారిత బుకింగ్ విధానానికి ఆమోదం తెలిపింది. మొదటిగా ముంబై సెంట్రల్-అహ్మదాబాద్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఈ తత్కాల్ టికెట్ బుకింగ్ ఓటీపీ వ్యవస్థ ప్రారంభమైంది.

తాజాగా మరిన్ని రైళ్లకు ఈ విధానం విస్తరించింది. ఈ నెల 6వ తేదీ నుంచి ఈ రైళ్లల్లో ఓటీపీ విధానం అమలులోకి రానుంది.
12219 ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్- సికింద్రాబాద్ దురంతో
12221 పూణే-హౌరా దురంతో
12223 ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్-ఎర్నాకులం జంక్షన్ దురంతో
12261 ఛత్రపతి శివాజీ మహరాజ్-హౌరా దురంతో
12263 పూణే-హజ్రత్ నిజాముద్దీన్ జంక్షన్ దురంతో
12289 సీఎస్‌ఎంటీ-నాగ్‌పూర్ దురంతో,
12290 నాగ్‌పూర్-సీఎస్‌ఎంటీ దురంతో
12293 ఎల్‌టీటీ-ప్రయాగ్‌రాజ్ దురంతో
12298 పూణే-అహ్మదాబాద్ జంక్షన్ దురంతో
20101 నాగ్‌పూర్-సికింద్రాబాద్ వందే భారత్
20670 పూణే-హుబ్లి జంక్షన్ వందే భారత్
20673 ఛత్రపతి షాహు మహారాజ్ టెర్మినస్ కొల్హాపుర్-పూణే వందే భారత్
20674 పూణే-ఛత్రపతి షాహు మహారాజ్ టెర్మినస్ వందే భారత్
12025 పూణే-హైదరాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (ఈ నెల 1వ తేదీ నుంచి ఈ రైలులో ఓటీపీ విధానం అమలులోకి వచ్చింది)
22221 సీఎస్‌ఎంటీ ముంబై-హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ లో నేటి నుంచి అమలులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications