ఓయులో రన్ ఫర్ ఎంప్లాయిమెంట్ ర్యాలీ
హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ వద్దంటూ రన్ ఫర్ ఎంప్లాయిమెంట్ పేరుతో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్సీసీ గేటు వద్ద విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడారు.
వారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన విరుచుకు పడ్డారు. ఏ విద్యార్థుల అండతో అధికారంలోకి వచ్చారో, అదే విద్యార్థుల ఆగ్రహంతో అధికారాన్ని కోల్పోతావని హెచ్చరించారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయడం వల్ల విద్యార్థులు దాదాపు 70 వేల ఉద్యోగాలను కోల్పోతారన్నారు.

సొంత కుటుంబంలో నలుగురికి రాజకీయ ఉద్యోగాలు ఏర్పాటు ఇప్పించుకున్న కేసీఆర్‌కు, విద్యార్థుల కుటుంబాల సంగతి అక్కర్లేదా అంటూ ప్రశ్నించారు. కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయరాదని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాగా, ప్రభుత్వ వ్యవహారశైలిని నిరసిస్తూ విద్యార్థులు ఉస్మానియాలోని ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీగా బయలు దేరారు. వీరిని ఎన్సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని బలవంతంగా పోలీసు వాహనాల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications