మేం వస్తే శివసేనలాంటి పరిస్థితి అన్నారు: కేటీఆర్, తండ్రుల పేర్లతో బతుకుతున్నారు: తలసాని

హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో శివసేన లాంటి వాతావరణం ఏర్పడుతుందని చాలామంది భయపెట్టారని మంత్రి కేటీఆర్ ఆదివారం అన్నారు. కానీ హైదరాబాదులో అన్ని వర్గాలు ఇప్పుడు సంతోషంగా ఉన్నాయని చెప్పారు.

ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్‌కు చెయ్యి గుర్తు కేటాయిస్తే ఆ పార్టీ ప్రజలకు చేయి ఇచ్చిందని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రజల చెవులలో పూవులు పెట్టిందని చెప్పారు. మాకు బాసులు ఢిల్లీ, విజయవాడలలో లేరని, తమ బాసులు హైదరాబాదులో ఉన్నారని చెప్పారు. అందుకే 2009 నుంచి 2013 వరకు ముగ్గురు ముఖ్యమంత్రులు మారారని కేటీఆర్ చెప్పారు.

 Our boss are not in Delhi and Vijayawada, says KTR

సనత్‌నగర్ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం మాట్లాడారు. ప్రజా కూటమి ఓ గాలి కూటమి అన్నారు. విర్రవీగే వాళ్లు రంగంలోకి వస్తే తేల్చుకుంటామని చెప్పారు. కూటమికి సిద్ధాంతాలు లేవని, చెబితే వినరన్నారు.

కూటమి నేతలు ఎన్నికలకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. తండ్రుల పేర్లు చెప్పుకొని కొందరు బతుకుతున్నారన్నారు. వారికి బిల్ కలెక్టర్ కూడా భయపడరన్నారు. కాంగ్రెస్ జీవితంలో గెలవదని, ఈ ఎన్నికల్లో స్వయంగా తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని అన్నారు.

సిసలైన తెలంగాణ బిడ్డే సీఎం అవుతారు

ప్రజా కూటమి అధికారంలోకి వస్తే సిసలైన తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. 2019లో బీజేపీకి మద్దతివ్వమని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పగలరా అని సవాల్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+