వావ్! ఖైరతాబాద్ గణేష్.. అంతా సిద్ధం, ఇదీ నిమజ్జనం రూట్ మ్యాప్ (పిక్చర్స్)

హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. ట్యాంక్‌బండ్‌తో పాటు 24 చెరువుల్లో నిమజ్జనోత్సవం జరగనుంది. శోభయాత్రకు గణనాథులు తరలి వస్తున్నారు.

శోభాయాత్రకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ నుంచి ప్రధాన శోభాయాత్ర ప్రారంభమైంది. 358 కిలో మీటర్ల మేర శోభాయాత్రలు జరగనున్నాయి.

వినాయక విగ్రహాల నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై 44 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గ్ వద్ద 22, ట్యాంక్‌బండ్ మీద 22 క్రేన్లు ఏర్పాటు చేశారు.

గణేష్ నిమజ్జనం

గణేష్ నిమజ్జనం

ఖైరతాబాద్‌లో కొలువై లక్షలాది మంది భక్తుల పూజలందుకున్న త్రిశక్తిమయ మోక్ష గణపతి నిమజ్జనం షెడ్యూల్ విడుదలైంది. ఈ మహా క్రతువును ఎటువంటి ఆటంకాలు లేకుండా ముగించేందుకు అధికారులు, పోలీసులు ఏర్పాట్లు చేశారు.

గణేష్ నిమజ్జనం

గణేష్ నిమజ్జనం

ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దేవదేవుడి దర్శనానికి ప్రజలను అనుమతిస్తారు. మూడు గంటల ప్రాంతంలో గణేశుని చేతిలో ఉన్న ఆరు వేల కిలోల లడ్డూను కిందకు దింపి భద్రపరుస్తారు.

గణేష్ నిమజ్జనం

గణేష్ నిమజ్జనం

ఈ లడ్డూను 30వ తేదీన భక్తులకు పంచుతారు. మహా గణపతి విగ్రహాన్ని నిలిపివుంచిన మెటల్ బీమ్స్‌ను వెల్డింగ్‌తో తొలగించిన తరువాత రాత్రి ఎనిమిది గంటలకల్లా విగ్రహాన్ని ట్రాలీ పైకి చేర్చనున్నారు.

 గణేష్ నిమజ్జనం

గణేష్ నిమజ్జనం

సోమవారం ఉదయం తర్వాత నాలుగో క్రేన్‌తో మహాగణపతి నిమజ్జనం పూర్తి చేసేందుకు పోలీసులు ప్రణాళిక రూపొందించారు.

గణేష్ నిమజ్జనం

గణేష్ నిమజ్జనం

ట్యాంక్‌బండ్‌పై 50 వైద్య శిబిరాలు, 30 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. 25వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

గణేష్ నిమజ్జనం

గణేష్ నిమజ్జనం

నిమజ్జనోత్సవానికి టెక్నాలజీ సాయంతో భద్రత కల్పించారు. ఇది వరకు ఎప్పుడూ లేనంత హైటెక్ సెక్యూరిటీ, 3కి.మీ ఒకటి చొప్పున మొత్తం 180 యాక్షన్ టీమ్స్ ఏర్పరిచారు.

గణేష్ నిమజ్జనం

గణేష్ నిమజ్జనం

కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిమజ్జన పర్యవేక్షణ చేస్తున్నారు. విధుల్లో మొత్తం 6456 మంది బల్దియా సిబ్బంది పనులు చేస్తున్నారు.

 గణేష్ నిమజ్జనం

గణేష్ నిమజ్జనం

నిమజ్జన మార్గాల్లో రేపు ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నిమజ్జనోత్సవానికి వచ్చేవారి కోసం 400 ప్రత్యేక బస్సులు, ఎనిమిది ఎంఎంటీఎస్ రైళ్లు ఏర్పాటు చేశారు.

గణేష్ నిమజ్జనం

గణేష్ నిమజ్జనం

పోలీసులు హెల్ప్‌లైన్ నంబర్లు 04027852482, 9490598985, 9010203626లకు ఏవైనా సమస్యలు ఉంటే ఫోన్ చేయాలని సూచించారు.

 గణేష్ నిమజ్జనం

గణేష్ నిమజ్జనం

అత్యంత వైభవంగా, కన్నుల పండువగా ఏటా హైదరాబాద్‌లో జరిగే మహా గణనాథుడి నిమజ్జనం మధ్యాహ్నం ప్రారంభం కానుంది.

గణేష్ నిమజ్జనం

గణేష్ నిమజ్జనం

ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకూ కొనసాగనున్న సామూహిక నిమజ్జనానికి పోలీస్‌ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.

 గణేష్ నిమజ్జనం

గణేష్ నిమజ్జనం

తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ నుంచి పోలీసు బలగాలను రప్పించారు. హైదరాబాద్, సైబరాబాద్‌ పరిధుల్లోని 8 చెరువుల్లో 40వేల విగ్రహాలు నిమజ్జనం కానున్నట్లు పోలీసుల అంచనా.

 గణేష్ నిమజ్జనం

గణేష్ నిమజ్జనం

ఖైరతాబాద్‌ గణేష్‌ నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ, పోలీస్ యంత్రాంగం రెండురోజుల ముందే ఏర్పాట్లన్నీ పూర్తిచేశాయి. వినాయక సాగర్ (హుస్సేన్ సాగర్‌) వద్ద నిమజ్జనం తీరును పర్యవేక్షించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+