వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతి విశ్వాసం ఆయన కొంప ముంచిందన్న ఎంపీ వినోద్ కుమార్ .. ఏ విషయంలో అంటే

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల నగారా మోగిన సందర్భంగా రాజకీయ పార్టీలు మునిసిపల్ ఎన్నికల కసరత్తులో పడిపోయారు. జనవరి 22న జరగనున్న మునిసిపల్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తరుణంలో టీఆర్ ఎస్ పార్టీ కీలక నేత, ప్రణాళికా సంఘం చైర్మన్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ గత ఎన్నికల్లో తన ఓటమిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత పార్లమెంట్ ఎలక్షన్స్‌లో తన ఓటమికి కారణం చెప్పారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ .

మునిసిపల్ అభ్యర్థుల ఎంపికలో కేటీఆర్ మాస్టర్ ప్లాన్ .. అదేంటంటేమునిసిపల్ అభ్యర్థుల ఎంపికలో కేటీఆర్ మాస్టర్ ప్లాన్ .. అదేంటంటే

అతి ఆత్మ విశ్వాసంతో, ప్రచారం చేయకపోవడం వలనే తాను ఓడిపోయినట్లు పేర్కొన్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ తనను దెబ్బ తీసిందని చెప్పిన ఆయన ఆ ఓటమి నుంచి పాఠం నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు. ఓటమి తనను అంతగా బాధించలేదని చెప్పుకొచ్చారు. అందుకు కారణం రాజకీయాల్లోకి పదవుల కోసం రాలేదని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావమప్పుడు తెలంగాణ సాధనే తమ లక్ష్యమని భావించి అందరం పని చేశామని తాము మంత్రులవుతామని, కేసీఆర్ సీఎం అవుతారని ఊహించలేదన్నారు.

 Over confidence defeated me in last parliament elections said former MP Vinod kumar

రానున్న మున్సిపల్ ఎలక్షన్స్‌లో టీఆర్ఎస్ పార్టీ వ్జయం సాధించటం ఖాయమని చెప్పారు వినోద్ . ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రజలు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. పార్టీలన్నాక సమస్యలు ఉండటం కామన్ అని, అందరి ఇబ్బందులు పరిష్కరించడం సాధ్యం కాదని చెప్పారు వినోద్ కుమార్. ఎన్నికలకు పార్టీ శ్రేణులందరూ సపోర్ట్ చెయ్యాలని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కంటెస్ట్ చేయాలనుకునే నాయకులు పాత , కొత్త నాయకులు చాలామంది ఉన్నారని ఇక సీట్ల కోసం పోటీ పడేవారికి అందరికీ అవకాశం రాకున్నా పార్టీ కోసం పని చేస్తే భవిష్యత్ లో పార్టీ గుర్తిస్తుంది అని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా అతి విశ్వాసమే ఆయన కొంప ముంచిందని తన ఓటమికి గల కారణాన్ని సెలవిచ్చారు మాజీ ఎంపీ వినోద్ కుమార్.

English summary
Former MP Vinod kumar claimed that he had lost in last elections because of his over confidence and lack of publicity. He claimed that overconfidence hurt him and that he had learned a lesson from that defeat. The reason is that he did not get into politics. When the Telangana Rashtra Samithi emerged, it was their goal to achieve Telangana. They all worked for that and they not expected as ministers and KCR to become CM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X