• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

4ఏళ్ల పాపకు లైంగిక వేధింపులు: అవసరమైతే మూసేయండి.. కమిషనర్‌ను కలిసిన అసద్

|

హైదరాబాద్: మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోమవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్‌ను , హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రఘునందన రావును కలిశారు. ఓ ప్రయివేటు స్కూల్లో నాలుగేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రణయ్ హత్య: పాతికేళ్ల క్రితం.. అమృత తండ్రి గురించి షాకింగ్ విషయాలు! కూతురుపై ఎంత ప్రేమంటే?

కాగా, హైదరాబాదు పాతబస్తీ ప్రాంతంలోని ఓ ప్రయివేటు స్కూల్లో చిన్నారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో పోలీసులు ఆధివారం 29 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని మొహమ్మద్ గిలానీగా గుర్తించారు. అతను స్కూల్ సూపర్‌వైజర్.

Owaisi meets Hyd police commissioner, seeks probe into sexual assault of 4 yr old

స్కూల్లో ఇంటర్వెల్ సమయంలో నిందితుడు.. పాపకు చాక్లెట్ ఇచ్చి బుజ్జగించి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతను పాపను ఎవరూలేని చోటుకు తీసుకు వెళ్లాడు. ఆ తర్వాత పాప మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఆమె నొప్పితో బాధపడుతుండటం చూసి, తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో విషయం వెలుగు చూసింది. విషయం తెలియగానే పెద్ద ఎత్తున జనాలు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. న్యాయం కావాలని డిమాండ్ చేశారు.

స్కూల్ ఆవరణలో పార్క్ చేసి ఉన్న ఖాళీ బస్సు పైన నిరసనకారులు రాళ్లు వేసి నిరసన తెలిపారు. స్కూల్లోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని, ఆ తర్వాత విడిచిపెట్టారు. పాపను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు.

ఈ కేసు విషయమై అసదుద్దీన్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్, కలెక్టర్‌ను కలిశారు. బాధిత విద్యార్థిని తండ్రితో కలిసి వచ్చారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. నిందితులపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ అంజనీ కుమార్ ఎంపీకి హామీ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ ఎడ్యూకేషన్ అధికారి నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి వాటిని సహించవద్దని, అవసరమైతే ఆ స్కూల్‌ను మూసివేయించాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AIMIM President Asaduddin Owaisi on Monday met with Hyderabad Collector Raghunandan Rao and city Police Commissioner Anjani Kumar, demanding swift action in the case of a 4 year old being sexually assaulted at a private school.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more