Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అధికారం ఉన్నప్పుడు, పోయాక.. ! ఎన్టీఆర్ ఉదాహరణ చెప్పిన ఓవైసీ..!

నేతలు అధికారంలో ఉన్నప్పుడు సెల్యూట్ లు కొట్టిన వాళ్లే.. ఒకసారి అధికారం కోల్పోయాక అదే నేతలతో అనుచితంగా ప్రవరిస్తున్న ఘటనలు తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. అయితే ఈ విషయం గుర్తుంచుకోవడంలో మాత్రం వారిని పోలీసుల సాయంతో టార్గెట్ చేస్తున్న నేతలు విఫలమవుతున్నారు. ఈ విషయాన్ని ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి గుర్తుచేసేందుకు ఎంఐఎం అధినేత ఇవాళ దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ ఉదాహరణ చెప్పారు.

యూపీలోని సంభాల్ లో ఐలవ్ మొహమ్మద్ అన్నందుకు ముస్లిం యువకులపై యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేయించి వేధిస్తోందని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. మా మసీదులను లాక్కుంటున్నారు. ఈ దేశంలో, 'నేను మోడీని ప్రేమిస్తున్నాను' అని చెప్పవచ్చు కానీ 'నేను మొహమ్మద్‌ను ప్రేమిస్తున్నాను' అని చెప్పకూడదన్నారు. మీరు ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారని బీజేపీని ప్రశ్నించారు. ఎవరైనా 'నేను మోడీని ప్రేమిస్తున్నాను' అని చెబితే, మీడియా కూడా సంతోషిస్తుందని, ఎవరైనా 'నేను మొహమ్మద్‌ను ప్రేమిస్తున్నాను' అని చెబితే అభ్యంతరం చెబుతోందన్నారు.

Owaisi Uses NTR s Example to Illustrate Police Action Against Leaders Who Lose Power

తాను ముస్లిం అయ్యానంటే, అది ముహమ్మద్ వల్లనేనని ఓవైసీ తెలిపారు. దేశ స్వాతంత్ర్యంలో పాల్గొన్న 17 కోట్ల మంది భారతీయులకు అంతకు మించి ఏమీ లేదన్నారు. యూపీలో హింసను తాము ఖండిస్తున్నామని, పోలీసులు లాఠీచార్జి చేస్తున్న వీడియోలు , దుకాణదారులు వారిపై పూల వర్షం కురిపిస్తున్న వీడియోలు కనిపిస్తున్నాయని తెలిపారు. పోలీసులు అధికారంలో ఉన్నవారికి మాత్రమే జవాబుదారీగా ఉంటారని గుర్తుంచుకోవాలని, రేపు అధికారం మారినప్పుడు వారు మిమ్మల్ని కొడతారని బీజేపీ నేతలకు గుర్తుచేశారు. ఇందుకు ఎన్టీఆర్ ఉదాహరణ చూపారు.

Owaisi Uses NTR s Example to Illustrate Police Action Against Leaders Who Lose Power

ఒకప్పుడు ఎన్టీఆర్ నియమించిన పోలీసు అధికారే, ఆయన అధికారం కోల్పోయాక ఆయనతో అనుచితంగా ప్రవర్తించిన విషయం ఓవైసీ గుర్తుచేశారు. దేశంలో బీజేపీ ముస్లింలను టార్గెట్ చేస్తున్న తీరుపై స్పందిస్తూ.. ఈ పరిస్థితి చూసి బాధపడొద్దని , ఓపికగా వ్యవహరించాలని కోరారు. చట్టం పరిధిలోనే మనం ప్రతిదీ చేయాలన్నారు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. మీరు చట్టం పరిధిలో పనిచేసినప్పుడు, చట్టం కేవలం సాలెగూడు మాత్రమేనని గ్రహిస్తారన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+