• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Padi Kaushik Reddy : డైలామాలో కౌశిక్ రెడ్డి... అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నారా...?

|
Google Oneindia TeluguNews

తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు... పాడి కౌశిక్ రెడ్డి విషయంలోనూ ఇదే జరుగుతోంది. అన్నీ అనుకూలిస్తే కాంగ్రెస్ అభ్యర్థిగానో,టీఆర్ఎస్ అభ్యర్థిగానో కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో ఉండేవాడు. కానీ పరిస్థితులు తలకిందులయ్యాయి. ఒక్క ఫోన్ కాల్ లీక్ ఆయన్ను ఎటూ కాకుండా చేసింది. అటు కాంగ్రెస్‌కు దూరమై... ఇటు టీఆర్ఎస్ టికెట్ వస్తుందో లేదో తెలియక కౌశిక్ రెడ్డి డైలామాలో పడ్డారు. ఒకవేళ టీఆర్ఎస్ టికెట్ దక్కకపోతే కౌశిక్ రెడ్డి ఏం చేయబోతున్నారు... అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నారా...

Kaushik Reddy Audio Leak : టీఆర్ఎస్ టికెట్ నాకే.. దుమారం రేపుతోన్న కౌశిక్ రెడ్డి ఆడియో లీక్...Kaushik Reddy Audio Leak : టీఆర్ఎస్ టికెట్ నాకే.. దుమారం రేపుతోన్న కౌశిక్ రెడ్డి ఆడియో లీక్...

షర్మిల పార్టీ వైపు చూస్తున్నారా...?

షర్మిల పార్టీ వైపు చూస్తున్నారా...?

హుజురాబాద్‌లో ఈటలకు ప్రత్యర్థిగా కౌశిక్ రెడ్డి బలమైన నేతగా ఎదిగారు. ఇప్పుడు ఉపఎన్నిక రూపంలో తన సత్తా చాటుకునే అవకాశం లభించింది. కానీ పరిస్థితులు మాత్రం కౌశిక్ రెడ్డికి అనుకూలించట్లేదు. ఇప్పటికే కాంగ్రెస్‌కు దూరమైన కౌశిక్... ఇక ఆశలన్నీ టీఆర్ఎస్ పైనే పెట్టుకున్నారు. టీఆర్ఎస్ ఆయనకు టికెట్ ఖరారు చేసిందా లేక ఆయనే అత్యుత్సాహం ప్రదర్శించారా అన్నది తెలియదు కానీ... మొత్తానికి రెంటికి చెడ్డ రేవడి అన్నట్లుగా ఆయన పరిస్థితి తయారైంది. ఒకవేళ టీఆర్ఎస్ టికెట్ నిరాకరిస్తే ఆయన భవితవ్యమేంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి వైఎస్ షర్మిల నాయకత్వంలోని వైఎస్సార్‌టీపీ వైపు చూస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా?

ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా?

టీఆర్ఎస్ టికెట్ దక్కని పక్షంలో షర్మిల పార్టీ నుంచి కౌశిక్ రెడ్డి టికెట్ కోరవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కౌశిక్ రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదన్న ప్రచారం ఉంది. షర్మిల పార్టీకి ప్రస్తుతం తెలంగాణలో పెద్దగా పునాదులు లేవు. కేవలం వైఎస్ మద్దతుదారులు,అభిమానులను మాత్రమే ఆ పార్టీ నమ్ముకుంది. మరోవైపు కౌశిక్ రెడ్డి హుజురాబాద్‌లో గతంలో 60వేల పైచిలుకు ఓట్లు సాధించారు. నియోజకవర్గంలో చాలా కుటుంబాలతో ఆయనకు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీ నుంచి పోటీ చేయడం కంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకే కౌశిక్ రెడ్డి మొగ్గుచూపవచ్చునన్న ప్రచారం సాగుతోంది.

టీఆర్ఎస్ టికెట్ ఇస్తుందా?

టీఆర్ఎస్ టికెట్ ఇస్తుందా?

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాక రెండు,మూడు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే రెండు రోజులు గడిచినా ఇప్పటికైతే ఎటువంటి ప్రకటన రాలేదు. బహుశా టీఆర్ఎస్‌ నుంచి టికెట్ వస్తుందన్న నమ్మకంతోనే కౌశిక్ రెడ్డి ఆ కామెంట్స్ చేసి ఉండొచ్చు. కానీ కౌశిక్ ఆడియో లీక్ తర్వాత పరిస్థితులను అంచనా వేసిన టీఆర్ఎస్ ఆయనకు టికెట్ ఇచ్చే ఆలోచనను విరమించుకుందేమోనన్న చర్చ జరుగుతోంది. అయితే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మదిలో ఏముందన్నది ఎవరికి అంతుచిక్కని అంశం. చాలా సందర్భాల్లో రిస్క్‌తో కూడిన నిర్ణయాలు తీసుకుని సక్సెస్ అయిన కేసీఆర్... ఈసారి కూడా రిస్క్ తీసుకుని కౌశిక్‌కే టికెట్ ఇస్తారా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

English summary
Padi Kaushik Reddy future plan-There is an interesting specualtions about Kaushik Reddy's political future after he quits congress party.If TRS will not give him Huzurabad ticket,what he will decides about his future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X