ఆసుపత్రిలో చేర్పిస్తే, తెల్లారే సరికే రోడ్డుపై శవంగా కనిపించాడు

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడన ఓ యువకుడిని మానవత్వంతో స్పందించి ఆస్పత్రిలో చేర్పిస్తే తెల్లారేసరికి ఆసుపత్రి బయట రోడ్డుపై ఆ యువకుడి మృతదేహం కనిపించిన సంఘటన నగరంలో చోటు చేసుకుంది. ఈ విషయమై ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో మృతుడి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

వివరాల్లోకి వెళితే, అల్మాస్‌గూడ రాజీవ్‌ గృహకల్పలో నివసించే ప్రేమ్‌కుమార్‌(26) గురువారం అర్ధరాత్రి బైక్‌పై ఇంటికి వస్తూ అల్మాస్‌గూడలో ఓ గోడకు ఢీకొట్టి కిందపడిపోయాడు. గట్టిగా శబ్దం రావడంతో అక్కడ నివసిస్తున్న నాగరాజు అనే వ్యక్తి నిద్రలేచి బయటికి వచ్చి చూడగా కిందపడి ఉన్న ప్రేమ్‌కుమార్‌ కనిపించాడు.

అదే సమయంలో అల్మాస్‌గూడకు చెందిన ఓ డాక్టర్‌ను దించటానికి మంద మల్లమ్మ చౌరస్తాలోని ఆర్‌కే మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి చెందిన కారు ఆ మార్గంలో వచ్చింది. ప్రేమ్‌కుమార్‌ను అదే కారులో ఆ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సీరియస్‌గా ఉండడంతో ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లమని వైద్యులు తెలిపారు.

దీంతో ప్రేమ్ కుమార్‌ను అక్కడ వదిలేసి నాగరాజు ఇంటికెళ్లిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. ప్రమాదం విషయం తెలిసి బాధితుడి కుటుంబ సభ్యులు ఆర్‌కే ఆస్పత్రికి శుక్రవారం తెల్లవారు జామున వెళ్లారు. ప్రేమ్‌కుమార్‌ కనిపించకపోకపోవడంతో వైద్యులను ప్రశ్నించగా ఉస్మానియాకు తరలించినట్టు చెప్పారు.

Patient's death: kin allege negligence by doctors at hyderabad

ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి వాకబు చేయగా అక్కడ చేర్పించలేదని తెలిసి మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ వెంకటయ్య ఆర్కే ఆస్పత్రికి వెళ్లి వైద్యులను ప్రశ్నించగా ఉస్మానియాకు తరలించామని చెప్పారు. అయితే శుక్రవారం ఉదయం బాధితుడి మృతదేహం ఆర్కే ఆస్పత్రి సమీపంలో ఉన్న సిగ్నల్‌ వద్ద రోడ్డుపై కనిపించింది.

చికిత్స చేయడంలో నిర్లక్ష్యం కారణంగా ప్రేమ్‌కుమార్‌ మృతి చెందాడని, ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని బయట పడేశారని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు ఆర్కే ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో స్థానికులు కలగజేసుకుని మృతుడి కుటుంబానికి 3.25 లక్షలు నష్టపరిహారం ఇప్పించేలా యాజమాన్యంతో చర్చలు జరిపినట్టు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+