Patnam Mahender Reddy: మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మహేందర్ రెడ్డి..
ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో మహేందర్ రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈటల రాజేందర్ బర్తఫ్ తో ఓ మంత్రి స్థానం ఖాలీగా ఉంది. ఇప్పుడు ఆ స్థానంలో మహేందర్ రెడ్డిని తీసుకున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మహేందర్ రెడ్డికి స్థానికంగా మంచి పట్టు ఉంది. 2018 ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మరోవైపు వైలట్ రోహిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత మహేందర్ వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకే కేటాయించాలని కోరారు.

అయితే మహేందర్ రెడ్డికి మంత్రి ఇస్తామని చెప్పడంతో ఎమ్మెల్యే టికెట్ వదులుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తూండూరు ఎమ్మెల్యే టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మహేందర్ రెడ్డిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే మహేందర్ రెడ్డి మంత్రి పదవిలో రెండు నుంచి మూడు నెలలే ఉండే అవకాశం ఉంది.
వచ్చే మూడు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పట్నం మహేందర్ రెడ్డి నాలుగుసార్లు తాండురు ఎమ్మెల్యేగా గెలిచారు. మహేందర్ రెడ్డి 2014లో టీడీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. ప్రమాణస్వీకారం కార్యక్రమంలో చాలా రోజుల తర్వాత గవర్నర్, సీఎం కలిశారు.












Click it and Unblock the Notifications