జిహెచ్ఎంసి: మాగంటి గోపీనాథ్‌కు పవన్ కళ్యాణ్ ఫోన్, టికెట్ కోసం సిఫార్సు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌కు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో జూబ్లీహిల్స్ డివిజన్ టికెట్ సుభాష్‌రెడ్డికి ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలిసింది. కానీ, ఈ డివిజన్ టికెట్‌ను బిజెపికి కేటాయించామని పవన్‌కు మాగంటి గోపీనాథ్ చెప్పినట్లు తెలిసింది.

కాగా, జిహెచ్ఎంసి ఎన్నికల్లో తమ తరఫున ప్రచారం చేయాలని టిడిపి, బిజెపి నాయకులు పవన్ కళ్యాణ్‌ను కోరారు. అందుకు ఆయన మందుకు వస్తారా, లేదా అనేది తేలాల్సి ఉంది. ఆయన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు.
కాగా, జిహెచ్ఎంసి ఎన్నికల్లో మూడో రోజు శనివారం రికార్డు స్థాయిలో 1003 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు 1097 నామినేషన్లు దాఖలయ్యాయి. 14 డివిజన్లలో నామినేషన్లు దాఖలా కాలేదు. లింగోజిగుడాలో రికార్డు స్థాయిలో 32 నామినేషన్లు దాఖలయ్యాయి.
శనివారం మంచి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద యెత్తున నామినేషన్లు వేశారు. తెరాస 277, బిజెపి 93, టిడిపి 187, కాంగ్రెస్ 200, స్వతంత్ర అభ్యర్థులు 249 నామినేషన్లు దాఖలు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications