తెలంగాణలో టీడీపీతో దూరం - బీజేపీ వ్యూహం వెనుక..!!
ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మూడు పార్టీల పొత్తు తెలంగాణలో కొనసాగటం పైన కొత్త చర్చ మొదలైంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. బీజేపీ, జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగాయి. పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచిన బీజేపీ భవిష్యత్ పైన ఆశలు పెంచుకుంటోంది. ఇదే సమయంలో తెలంగాణలతో బీజేపీ, జనసేన మైత్రి పైన పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. దీంతో, టీడీపీ తో కలుస్తారా లేదా అనే సందేహం మొదలైంది.
నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ కొండగట్టు బయలుదేరారు. తమ ఇంటి ఇలవేల్పు అయిన కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించుకోనున్నారు. కొండగట్టులో ప్రత్యేక పూజల తర్వాత తిరిగి హైదరాబాద్‌కు కల్యాణ్ రానున్నారు. అంతకు ముందు పవన్ కల్యాణ్ నివాసం వద్ద అభిమానుల సందడి పెద్ద ఎత్తున నెలకొంది. పవన్ నివాసానికి వచ్చిన సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సైతం వచ్చారు. పన్ కు సిద్దపేటలో అభిమానులు భారీగా తరలి వచ్చి స్వాగతం పలికారు. ఈ సమయంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు.

తెలంగాణలో బీజేపీ - జనసేన పొత్తు కొనసాగుతుందని పవన్ చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన విధంగానే ఈ రెండు పార్టీలు తిరిగి కలిసి పొత్తులో కొనసాగాలని నిర్ణయించినట్లు కనిపిస్తోంది. ఏపీలో టీడీపీతో పొత్తు ఉన్నా..తెలంగాణలో మాత్రం బీజేపీ, జనసేనకు మాత్రమే పొత్తు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. త్వరలో తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ -జనసేన పొత్తులో ఎన్నికల్లో బీజేపీ 8 అసెంబ్లీ స్థానాలు గెలిచింది.

బీజేపీకి ఓట్లు..సీట్లు పెరగటంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. బీఆర్ఎస్ రాజకీయంగా బలహీనపడుతున్న వేళ..తాము ఆ స్థానంలో బలపడాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో..టీడీపీతో కలవటం కంటే..పవన్ తో మాత్రమే పొత్తుతో వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో..భవిష్యత్ లో ఏపీ తరహాలోనే మూడు పార్టీలు తెలంగాణలో కలుస్తాయా లేదా అనేది బీజేపీ - టీడీపీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications