పవన్ కళ్యాణ్.. సలహాలు కావాలంటే అడుగు, నేనిస్తా: మహేష్ కత్తి
హైదరాబాద్: జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్‌పై సినీ క్రిటిక్ మహేష్ కత్తి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. రూల్స్ ప్రకారం చూసుకుంటే జనసేన అసలు పార్టీయే కాదంటూ ఓ ట్వీట్ లో మహేష్ కత్తి తేల్చేశాడు.
ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన ప్రాథమిక అర్హతలు కూడా జనసేనకు లేవని వ్యాఖ్యానించాడు. అంతేకాదు, ఆ పార్టీలో జనం లేరు, సేన లేదని.. కేవలం పిచ్చి అభిమానులు, కులపిచ్చిగాళ్లు మాత్రమే ఉన్నారంటూ వ్యాఖ్యానించాడు.
ప్రతిదానికీ 'చంద్రబాబు కి తెలియకపోవచ్చు' అంటావేంటయ్యా బాబూ... ఆయన ముఖ్యమంత్రి కాడా లేక అంత పనికిమాలినవాడు అని నీ అభిప్రాయమా!? లేక ఎలా వెనకేసుకు రావాలో నీకు అర్థం కావడం లేదా! Get some good advisors, consultants and language trainers. Do you want me to suggest some, I will.
— Mahesh Kathi (@MaheshhKathi) December 9, 2017
మరో ట్వీట్‌లో ''ప్రతిదానికీ 'చంద్రబాబుకు తెలియకపోవచ్చు' అంటావేంటయ్యా బాబూ.. ఆయన ముఖ్యమంత్రి కాడా లేక అంత పనికిమాలిన వ్యక్తి అని నీ అభిప్రాయమా? లేకపోతే ఎలా వెనకేసుకు రావాలో నీకు అర్థం కావడంలేదా?'' అంటూ ఎద్దేవా చేశాడు.
అంతేకాదు, మంచి సలహాదారులను, కన్సల్టెంట్లను, లాంగ్వేజి ట్రైనర్లను నియమించుకోమంటూ పవన్ కళ్యాణ్‌కు సూచించాడు. ''సలహాలు కావాలంటే అడుగు, ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా..'' అంటూ తన ట్వీట్‌లో హహేష్ కత్తి పేర్కొన్నాడు.












Click it and Unblock the Notifications