వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై పవన్ చేతులెత్తేసినట్లేనా? ఆయన పాత్ర కీలకంగా మారనుందా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయరా...?

హైదరాబాద్: కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో తెలంగాణలో ముందస్తు రాజకీయ వేడి రాజుకుంది. టీఆర్ఎస్ అప్పుడే ప్రచార రంగంలోకి దూకింది. కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ సహా ఇతర విపక్షాలు ఓ వైపు పొత్తులు, అభ్యర్థుల గురించి చర్చిస్తూనే మరోవైపు ప్రజల్లోకి వెళ్లడంపై దృష్టి సారించాయి.

కానీ తెలంగాణలో ఇంత ముందస్తు వేడి రాజుకుంటున్నప్పటికీ జనసేన దూకుడు మాత్రం కనిపించడం లేదు. ఆయన 2019లో ఎన్నికలు వస్తాయని భావించి ఉంటారు. కానీ తెలంగాణలో అనుకోకుండా ముందస్తు వచ్చింది. ఎన్నికలకు సిద్ధంగా లేనందున పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు తక్కువ అంటున్నారు.

ఆ కమిటీలో రేవంత్ రెడ్డికి చోటు: చంద్రబాబు-రాహుల్ గాంధీ దోస్తీ ఖాయం!ఆ కమిటీలో రేవంత్ రెడ్డికి చోటు: చంద్రబాబు-రాహుల్ గాంధీ దోస్తీ ఖాయం!

చేతులెత్తేసే అవకాశం

చేతులెత్తేసే అవకాశం

జనసేన పార్టీ తీరు, పరిస్థితులు చూస్తుంటే పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ నుంచి దూరం ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఎన్నికల సంఘం 2019లో ఎన్నికలు నిర్వహిస్తే కనుక పోటీ చేయవచ్చునని, కానీ డిసెంబర్‌లోనే నిర్వహిస్తే మాత్రం పూర్తిగా సన్నద్ధం కాకపోవడంతో చేతులెత్తేయవచ్చునని చెబుతున్నారు.

పవన్ అలా చేస్తే బెట్టర్

పవన్ అలా చేస్తే బెట్టర్

పవన్ ఇటీవలే ఏపీలో జోరుగా పర్యటిస్తున్నారు. ఈ మధ్య కొంత విరామం తీసుకున్నారు. ఆయన ప్రధానంగా తెలంగాణ కంటే ఏపీపై దృష్టి సారిస్తున్నారు. ఏపీలో అంతగా పర్యటిస్తున్నప్పటికీ.. ఇప్పుడిప్పుడే పార్టీ ఓ రూపు దిద్దుకుంటోంది. అలాంటిది తెలంగాణలో ఇక ఏమాత్రం పార్టీ రూపుదిద్దుకోలేదు. పోటీ చేసి అవమానకర ఓటమి చెందడం కంటే పోటీ చేయకపోవడమే బెట్టర్ అని, ఏపీపై ప్రధానంగా దృష్టి సారించడమే మంచిదని అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణపై దృష్టి సారిస్తేనే మంచిదని జనసైనికులు భావిస్తున్నారని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ మౌనంగానే ఉంటారా?

పవన్ కళ్యాణ్ మౌనంగానే ఉంటారా?

ముందస్తు వస్తే, పవన్ కళ్యాణ్ పోటీ చేయకుంటే ఆయన పాత్ర ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది. ఏ పార్టీకైనా లేదా ఏ కూటమికైనా మద్దతిచ్చి ప్రచారం చేస్తారా లేక మిన్నకుంటారా అనే చర్చ సాగుతోంది. ఇటీవల ఆయన కరీంనగర్ జిల్లాలో పర్యటించినప్పుడు కేసీఆర్ పైన ప్రశంసలు కురిపించారు. అలాగే ఆయన సోదరుడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్రధాని మోడీ అంటే గౌరవం అని చెబుతారు. కాబట్టి ఆయన సైలెంట్‌గా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే, సీపీఎం వంటి పార్టీలు ఇప్పటికే కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపిన నేపథ్యంలో వారికి మద్దతు కూడా ఇవ్వవచ్చునని అంటున్నారు. పవన్ మద్దతు కోసం విపక్షాలు ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కేవలం మద్దతే కాదు.. ప్రచారం కోసం కూడా కోరే అవకాశాలు ఉంటాయి.

శానస సభ రద్దుపై జనసేన భేటీ

శానస సభ రద్దుపై జనసేన భేటీ


కాగా, జనసేన పార్టీ మాత్రం తెలంగాణ శాసన సభ రద్దుపై శుక్రవారం స్పందించింది. శాసన సభ రద్దు నేపథ్యంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్) ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణలో వివిధ రాజకీయ పక్షాలు, రాజకీయ కుటముల బలాబలాలను ప్యాక్ బేరీజు వేసిందని, తెలంగాణలో తమ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఒక నివేదిక రూపొందించి పవన్‌కు సమర్పించాలని నిర్ణయించామని తెలిపింది. శని లేదా ఆదివారం పార్టీ అధ్యక్షుడితో సమావేశమై విస్తృతంగా చర్చించే అవకాశముందని, తెలంగాణలో జనసేనతో కలిసి పని చేయాలని సీపీఎం ఆసక్తి కనబరిచిందని గుర్తు చేసింది. అన్నింటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అభిప్రాయపడింది.

English summary
Pawan Kalyan's Jana Sena may not contest in Telangana Assembly polls if held before December 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X