కేసీఆరే స్ఫూర్తి: ఆశ్చర్యం, ఆనందం: భేటీ అనంతరం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. సోమవారం సాయంత్రం ఆయన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్‌లో కలిశారు.

సోమవారం సాయంత్రం 6.20గంటలకు ప్రగతి భవన్ చేరుకున్న పవన్ కళ్యాణ్.. కేసీఆర్ కోసం వేచి చూశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ ను కలిసేందుకు వెళ్లిన కేసీఆర్.. 7.30గంటలకు ప్రగతి భవన్ వచ్చారు. ఆ తర్వాత పవన్, కేసీఆర్‌లు సుమారు గంటపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్.. కేసీఆర్‌‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఏపీ రాజకీయాలతోపాటు పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది.

కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశంసలు

కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశంసలు

కేసీఆర్‍‌తో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. రైతులకు 24గంటలపాటు విద్యుత్ సరఫరా చూసి తాను ఆశ్చర్యపోయానని పవన్ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అంధకారంలోకి వెళుతుందన్న వాదన నుంచి 24గంటల విద్యుత్ సరఫరా అందించే స్థాయికి చేరుకుందని అన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయమేనని అన్నారు. ఇది తనకు ఆశ్చర్యంతోపాటు ఆనందాన్ని కలగజేసిందన్నారు.

కేసీఆర్ స్ఫూర్తిగా..

కేసీఆర్ స్ఫూర్తిగా..

సమయం కుదరకే తాను తెలుగు మహాసభలకు రాలేకపోయానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇటీవల రాష్ట్రపతికి గవర్నర్ ఇచ్చిన విందులో తాను కేసీఆర్ ను కలిశానని, అప్పుడు మరోసారి కలవాలని కేసీఆర్ అన్నారని, తనకు ఇప్పుడు వీలు కలిగిందని, అందుకే ఆయనను కలిశానని చెప్పారు.హక్కుల సాధనకు కేసీఆర్ చేసిన పోరాటాన్ని ఏపీ నేతలు స్ఫూర్తిగా తీసుకోవాలని తాను చెబుతానని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ ఉద్యమమన్నా, ఉద్యమ నేతలన్నా తనకుగౌరవం ఉందని తెలిపారు.

పొత్తుల విషయం కాదు.. అభిమానులున్నారు

పొత్తుల విషయం కాదు.. అభిమానులున్నారు

పొత్తు విషయంలో ఎలాంటి చర్చా జరగలేదని, రైతులకు 24గంటల విద్యుత్ ఇస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపానని పవన్ చెప్పారు. తెలంగాణలో తనకు అభిమానులున్నారని, బలంగా కూడా ఉందని ఆయన అన్నారు.

ఇదో గుడ్ విల్ మీట్

ఇదో గుడ్ విల్ మీట్

తాను పలు విషయాలపై అవగాహన పెంచుకునేందుకు పలువురు నేతలను కలుస్తున్నానని, కేసీఆర్‌ను కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని అన్నారు. ఇదొక గుడ్ విల్ మీట్ అని చెప్పారు.

ఉద్యమ నేత వల్లే..

ఉద్యమ నేత వల్లే..

గతంలో కాంగ్రెస్ నేత జానారెడ్డి 24గంటలపాటు కరెంటు ఇస్తే.. తానే టీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తానని అన్నారని, కాగా, తెలంగాణ ప్రభుత్వం చెప్పింది చేసి చూపిస్తోందని అన్నారు. ఉద్యమ నేతలు కాకుండా వేరే వాళ్లతో ఇది సాధ్యం అయ్యుండేది కాదేమోనని అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Janasena President Pawan Kalyan Satureday met Telangana CM K Chandrasekhar Rao and praised KCR government policies.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి