తెలంగాణలో జనసేనకు రాజకీయ పార్టీ గుర్తింపు, పవన్ కళ్యాణ్ 'గ్రేటర్' ప్లాన్ ఏమిటి?

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి రాజకీయ పార్టీగా గుర్తింపు వచ్చింది. తెలంగాణ ఎన్నికల కమిషన్‌లో జనసేన పార్టీని నమోదు చేశారు. దీనిని ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీగా గుర్తింపు ఇచ్చింది.

వారం క్రితమే ఈసి రిజిస్టర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రేపు గెజిట్ విడుదలయ్యే అవకాశముంది.

రాజకీయ పార్టీగా నమోదు చేసుకున్నట్లు తెలంగాణ ఎన్నికల సంఘం బుధవారం నాడు ప్రకటించింది. కాగా, రాజకీయ పార్టీగా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెడతారా తెలియాల్సి ఉంది.

Pawan Kalyan's Jana Sena got EC recognition

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోను బిజెపి - టిడిపి కూటమికి ఆయన మద్దతు పలికారు. ఆ పార్టీల తరఫున తెలంగాణ, ఏపీల్లో జోరుగా ప్రచారం చేశారు.

ఎన్నికల అనంతరం జనసేన కార్యకలాపాల పైన ఆ పార్టీ పలుమార్లు స్పందించింది. తమకు రాజకీయ పార్టీగా గుర్తింపు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కార్యాచరణ నిర్ణయిస్తారని తెలిపింది. ఇప్పుడు రాజకీయ పార్టీగా గుర్తింపు లభించిన నేపథ్యంలో పవన్.. ఏం చేయనున్నాడనేది తెలియాల్సి ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేక టిడిపి - బిజెపి కూటమికి మద్దతు పలుకుతారా చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+