pegasus నిఘా కుట్ర: అసలు రహస్యం చెప్పేసిన విజయశాంతి -7వేల ఫోన్లు ట్యాపింగ్ -దెయ్యాలు:వేదాలు
రాజకీయ, న్యాయ, వ్యాపార, మీడియా, సామాజిక రంగాలకు చెందిన వందల మంది ప్రముఖలు ఫోన్లను నిరంతరం ట్యాపింగ్ చేస్తూ, వారి కదలికలపై నిఘా పెట్టి తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందుతోందని కేంద్రంలోని మోదీ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఎన్ఎస్ఓ అనే నిఘా సంస్థ ద్వారా పెగాసస్ స్పైవేర్ ను వాడుతోనన కేంద్రం ఈ మేరకు దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పార్లమెంటులో ఈ అంశం రచ్చకు దారితీసింది. పెగాసస్ ఉదంతంపై కేంద్ర ఐటీ, హోం శాఖలను విచారించేందుకు పార్లమెంటరీ కమిటీ సిద్ధమవుతున్నది. కాగా,

విజయశాంతి కీలక వ్యాఖ్యలు
యావత్ దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ నిఘా కుట్ర ఉదంతంపై అధికార బీజేపీ, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తెలంగాణ బీజేపీ కీలక నేత, నటి విజయశాంతి సైతం ఈ వివాదంపై స్పందిస్తూ, సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. అసలీ వివాదం ఎందుకు పుట్టుకొచ్చిందో, ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో పేర్కొంటూ, నాటి కాంగ్రెస్ హయాంలో చోటుచేసుకున్న నిఘా వ్యవహారాలనూ ఆమె ప్రస్తావించారు. ఈ మేరకు విజయశాంతి బుధవారం తన సోషల్ మీడియా ఖాతాల్లో ఇలా రాసుకొచ్చారు..

పెగాసస్ రచ్చ.. అసలు కథ ఇదీ..
''పెగాసస్ నుండి ఎలాంటి సాఫ్ట్‌వేర్ కొనుగోలు చెయ్యలేదని భారత ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. పెగాసస్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. నిజానికి కొన్ని ఎన్జీవోలకు వస్తున్న విదేశీ నిధులపై నియంత్రణ ఏర్పడిన దృష్ట్యా, ఆ సంస్థలు అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట దెబ్బ తీసే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతోంది. ఇందులో ప్రతిపక్షాలు భాగస్వామ్య పాత్ర పోషిస్తున్నాయి. అసలు ఏం జరిగిందనే విషయమై ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్న కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు ఒక్క విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి..
Recommended Video


సొంత మనుషులపై సోనియా నిఘా
2010లో ఓ సందర్భంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్.. పన్నులు ఎగ్గొట్టే కార్పోరేట్ సంస్థలు, హవాలా కార్యకలాపాలు, జాతీయ భద్రత తదితర అంశాల్లో ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చెయ్యడాన్ని సమర్ధించుకున్నారు. అంతేకాదు, సోనియా ఆదేశాలతో నాటి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ ఫోన్‌లను కూడా హోం మంత్రి చిదంబరం ట్యాపింగ్ చేయిస్తే, ఇదేంటని ప్రశ్నిస్తూ ప్రధానికి ప్రణబ్ లేఖ రాశారు. గత యుపిఎ-2 సర్కారు హయాంలో సుమారుగా 7 వేలకు పైగా ఫోన్లు, దాదాపు 500 ఈమెయిల్ అకౌంట్స్‌పై ప్రభుత్వం నిఘా పెట్టినట్టు 2013 నాటి ఒక ఆర్టీఐ దరఖాస్తుకు బదులు వచ్చింది. ఆ చర్యలన్నిటికీ సాక్ష్యాలున్నాయి. కానీ, ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్న నేతలు నేడు కేంద్ర ప్రభుత్వంపై నిజాలు తెలుసుకోకుండా నిందలు వేయడం దయ్యాలు వేదం వల్లిస్తున్నట్టే ఉంది'' అని విజయశాంతి మండిపడ్డారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications