శంషాబాద్‌లో ఏటీఎం విచిత్రం: రూ.100 విత్ డ్రా చేస్తే రూ.500, జనం క్యూ

శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఓ ఏటీఎం నుంచి డబ్బుల వర్షం కురిసింది. ఏటీఎం నుంచి రూ.100 విత్ డ్రా చేయగా.. రూ.500 నోటు వచ్చింది.

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఓ ఏటీఎం నుంచి డబ్బుల వర్షం కురిసింది. ఏటీఎం నుంచి రూ.100 విత్ డ్రా చేయగా.. రూ.500 నోటు వచ్చింది. ఈ విషయం తెలియడంతో చాలామంది ఏటీఎం వద్దకు చేరుకున్నారు.

చాలామంది అలా డ్రా చేసుకున్నారు. దాదాపు రూ.8 లక్షల మేర నగదు డ్రా అయినట్లుగా తెలుస్తోంది. విమానాశ్రయంలోకి వెళ్లే వద్ద రెండో గేటు సమీపంలో కొటక్ మహింద్రా బ్యాంకుకు చెందిన ఏటీఎం ఉంది.

People flock as Samshabad ATM dispatched Rs 500 inplace of 100s

ఓ వ్యక్తి శనివారం సాయంత్రం రూ.2500 డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. అతనికి రూ.2000 నోటు ఒకటి వచ్చింది. మిగతా రూ.500కు.. అయిదు వంద నోట్లు లేదా ఒక ఐదు వందల నోటు రావాలి. కానీ అతనికి అయిదు 500 నోట్లు వచ్చాయి.

మొత్తం రూ.4500 వచ్చాయి. దీంతో ఏటీఎం వద్ద క్యూలో నిలుచుకన్న మిగతా వారు కూడా ఇలాగే డ్రా చేసుకొని వెళ్లిపోయారు. ఇలా అరగంటకు పైగా జరిగింది. విమానాశ్రయ అధికారులు బ్యాంకు సిబ్బందిని రప్పించి తాత్కాలికంగా మూసివేయించారు. సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+