బంజారాహిల్స్‌లో సైకో వీరంగం: ఐదుగురికి కత్తిపోట్లు, ఒకరు మృతి
హైదరాబాద్: బుధవారం సాయంత్రం బంజారాహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు నెంబర్ 12లోని ఎన్‌బీటీ నగర్‌లో సైకో కత్తితో వీరంగం సృష్టించాడు. అటుగా వెళ్తోన్న ఐదుగురు వ్యక్తులను అడ్డగించి వారిపై కత్తులతో దాడి చేసి, అనంతరం వారు పరారయ్యారు.
ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స కోసం ముగ్గురిని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి, ఇద్దరిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతుతూ బబ్లూ అనే యువకుడు మృతి చెందాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. దాడికి జరిగిన తీరు గురించి వివరాలను సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు ఘటన జరిగిన స్థలంలో ప్రత్యక్ష సాక్షులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.
లాడ్జిలో 8 కేజీల బంగారం
నగరంలోని బాలానగర్‌లోని ఓ లాడ్జిలో పెద్దఎత్తున బంగారం ఉన్నట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, ఆ లాడ్జిపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 8 కేజీల బంగారం పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు వ్యాపారులు ప్రణాళిక రచించారని, అందులో భాగంగా దీనిని లాడ్జిలో ఉంచారని వారు వెల్లడించారు.

దారుణం: మహిళ గొంతు కోసి మెడలో చైన్ లాక్కెళ్లారు
వరంగల్‌లో దారుణం జరిగింది. నగరంలోని గిర్మాజిపేటలో చైన్‌స్నాచర్లు ఓ మహిళ గొంతు కోసి ఆమె మెడలో ఉన్న చైన్‌ను లాక్కెళ్లారు. ఈ ఘటన వరంగల్ పట్టణంలో సంచలనం సృష్టిస్తోంది. దీనిని బట్టి చైన్ స్నాచర్లు ఎంతటి అఘయిత్యాలకైనా పాల్పడతారని అర్ధమవుతోంది.

గత వారం రోజులుగా వరంగల్‌లో చైన్‌స్నాచింగ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్ నగరానికే పరిమితమైన ఈ చైన్ స్నాచింగ్‌లు ఇప్పుడు వరంగల్, కరీంనగర్ పట్టణాలకు కూడా పాకాయి. బీహార్ రాష్ట్రానికి చెందిన ముఠాలు ఈ తరహ దోపిడీలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications