కేసీఆర్‌కు ఝలక్: ప్రగతి నివేదన సభకు వ్యతిరేకంగా పిటిషన్, కారణం ఇదే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి తలపెట్టిన ప్రగతి నివేదన సభను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలైంది. నాలుగున్నరేళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించే ఉద్దేశ్యంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రగతి నివేదన సభ తలపెట్టిన విషయం తెలిసిందే.
దీనిని ఆపాలంటూ పిటిషన్ దాఖలు అయింది. సభలు పెట్టి ప్రజలకు, పర్యావరణానికి ఇబ్బందులు కలగకుండా చూడాలని న్యాయవాది, పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రగతి నివేదన సభకు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలన్నారు.

ఈ పిటిషన్ పైన న్యాయస్థానం శుక్రవారం విచారించనుంది. కాగా, వచ్చే నెల సెప్టెంబర్ రెండో తేదిన ప్రగతి నివేదన సభను ఘనంగా నిర్వహించేందుకు తెరాస కసరత్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications