ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే.: ఆస్పత్రికి హరీశ్ రావు, ఖమ్మం జైలుకు నిందితుడు సైఫ్
హైదరాబాద్: సీనియర్ వేధింపులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. ఆమెకు ఎక్మో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రీతికి ప్రత్యేక వైద్యుల బృందం ఆధ్వర్యంలో వైద్యం అందిస్తున్నామని నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలిపారు. మరోవైపు, నిమ్స్ కు వెళ్లిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రీతి ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యులను అడిగి ఆమెకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే, హరీశ్ రావును అడ్డుకునేందుకు బీఎస్పీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి.

ఖమ్మం జైలుకు నిందితుడు సైఫ్
ప్రీతిని వేధింపులకు గురిచేసిన నిందితుడు సైఫ్ ను ఖమ్మం జైలుకు తరలించారు. అంతకుముందు సైఫ్ ను కోర్టులో హాజరుపర్చారు. దీంతో నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఆ తర్వాత సైఫ్ ను ఖమ్మం జైలుకు తరలించారు. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారణమైన సైఫ్ పై ర్యాగింగ్ కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
సైఫ్ గత నాలుగు నెలలుగా ప్రీతిని వేధించినట్లు ఆధారాలున్నాయని సీపీ రంగనాథ్ ఈరోజు మీడియాకు వెల్లడించారు. వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టి ప్రీతిని అవమానించాడని చెప్పారు. గ్రూప్ లలో మెసేజ్ లు పెట్టి వేధించొద్దని ప్రీతి వేడుకున్నా సైఫ్ వినలేదన్నారు. బ్రెయిన్ లేదంటూ సైఫ్ హేళన చేస్తూ మాట్లాడుతున్నాడని ప్రీతి ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. సైఫ్ వేధింపులు తట్టుకోలేకే ప్రీతి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందని వివరించారు. ఇది ఇలావుండగా, సైఫ్‌పై పెట్టిన కేసులను రద్దు చేయాలంటూ అతని సహచర వైద్య విద్యార్థుల కొందరు ఆందోళన చేపట్టారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications