phone tapping case: వరంగల్, ఖమ్మంతో సహా 7చోట్ల ఫోన్ ట్యాపింగ్ కేంద్రాల్లో జరిగిందిదే!!

తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే నల్గొండ కేంద్రంగా వార్ రూమ్ ఏర్పాటుచేసి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు గుర్తించిన అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా కూడా అనేకచోట్ల ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు పోలీసులు తమ దర్యాప్తులో కనుగొన్నారు.

వరంగల్, సిరిసిల్ల, ఖమ్మంలోనూ ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు నల్గొండ, హైదరాబాద్లలో రెండు చోట్ల ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. అంతేకాదు వరంగల్ జిల్లా పర్వతగిరి లోను, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్లలోనూ, ఖమ్మంలో ఒకచోట ఫోన్ ట్యాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ట్యాపింగ్ కు పాల్పడ్డారు. నల్గొండలోని వీటీ కాలనీలో నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి వార్ రూమ్ ఏర్పాటుచేసి ఫోన్ ట్యాపింగ్ చేశారు.

phone tapping case 7 phone tapping centers along with Warangal Khammam did Settlements and threatens

రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్
ఇప్పటివరకు మొత్తం ఏడుచోట్ల ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇంకా ముందు ముందు పోలీసులు దర్యాప్తులో ఎన్ని చోట్ల ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారో బయటపడే అవకాశం ఉంది. ఇప్పటివరకు పోలీసుల దర్యాప్తును బట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ రాష్ట్రంలోని ఒక ప్రాంతానికే పరిమితం కాలేదని, రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల జరిగిందని సమాచారం.

ఫోన్ ట్యాపింగ్ సెంటర్లతో చేసిన పని ఇదే
ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మామిడి తోటలో గెస్ట్ హౌస్ లో ఫోన్ ట్యాపింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇక హైదరాబాద్ ఎస్ఐబి ఆఫీస్ తో పాటు, జూబ్లీహిల్స్ లోను ఫోన్ ట్యాపింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ సెంటర్ల ద్వారా రాజకీయనాయకులను, బడా పారిశ్రామికవేత్తలను, వ్యాపారవర్గాలను టార్గెట్ చేసి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు, పొలిటీషియన్స్ కు సంబంధించి అనేక రాజకీయ రహస్యాలను తెలుసుకున్నట్టు పోలీసులు గుర్తించారు.

టాప్ టూ బోటమ్.. అంతా సెటిల్మెంట్ లు, బెదిరింపులు
ఇక ఈ సెంటర్ల ద్వారా డిసిపి స్థాయి నుండి కానిస్టేబుల్ వరకు సెటిల్మెంట్లు చేశారని, బెదిరింపులకు పాల్పడ్డారని, కొందరైతే మహిళలపై లైంగిక వేధింపులకు దిగారని తెలుస్తుంది. నేతల కనుసన్నల్లోనే, పోలీసులు అందరూ కలిసి ఫోన్ ట్యాపింగ్ చేశారని సమాచారం. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికి పోలీసుల అదుపులో నలుగురు కానిస్టేబుల్స్ ఉండగా, ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు నేతలకు, పోలీసులకు నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+