హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెక్లెస్ రోడ్డులో రేసింగ్ పోకిరీలు, సోషల్ వెబ్‌సైట్లతో.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగర రోడ్ల పైన పోకిరీలు హల్ చల్ చేస్తున్నారు. నగరం నడిబొడ్డు, శివార్లు అనే తేడా లేకుండా బైక్ రేసింగులు నిర్వహిస్తున్నారు. భీకర శబ్దాలు చేసే 1000 సీసీ బైకులతో పోటీలు పడుతూ ప్రాణాంతక పరిస్థితులు కొని తెచ్చుకుంటున్నారు. సామాజిక అనుసంధాన వేదికల ద్వారా ఆహ్వానం పలుకుతూ వారాంతాల్లో రేసింగులు చేస్తున్నారు.

పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కుర్రకారు ఆగడం లేదు. రేసింగ్‌లకు సైసై అంటోంది.

క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నా, జైలుకు పంపుతామన్నా, యువత జంకే పరిస్థితులు కనిపించడం లేదు. రేసింగ్‌ ప్రాణాలతో చెలగాటమని తెలిసినా వెనక్కు తగ్గడం లేదు. జూలై నెలలో నార్సింగ్‌ పోలీసులు పక్కా సమాచారం సేకరించి గండిపేట చెరువు గట్టును రెండు వైపులా మూసేశారు. ఇటీవల అక్కడ బైక్‌ రేసింగ్‌ నిర్వహించిన 83 మంది యువకులతో పాటు మైనర్లను పట్టుకున్నారు. వారి నుంచి ఖరీదైన వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ చేశారు. మరోసారి రేసింగ్‌లకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయినా కుర్రకారు అక్కడ అడపాదడపా రేసింగ్‌లు నిర్వహిస్తూనే ఉన్నారు. తాజాగా నెక్లెస్‌ రోడ్డు రేసింగ్‌లకు వేదికవుతోంది. ఆదివారం వేకువజామున రేసింగ్‌లకు సిద్ధమైన సుమారుగా 100 మంది యువకులను రాంగోపాల్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 100 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

వీరిలో 80 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. వీరంతా లోగడ రేసింగ్‌లు నిర్వహించిన వారేనని తెలుస్తోంది.ఈ కారణంగానే పోలీసులు కేసులు నమోదు చేశారు. మిగిలిన 20 మంది మొదటిసారిగా రేసింగ్‌లకు హాజరుకావడంతో కౌన్సెలింగ్‌తో సరిపెట్టారు. నెక్లెస్‌రోడ్డులో జరుగుతున్న రేసింగ్‌ల కారణంగా అక్కడ వాకింగ్‌ చేయడానికి ప్రజలు భయపడిపోతున్నారు.

 బైక్ రేసింగ్

బైక్ రేసింగ్

నెక్లెస్‌రోడ్డులో పోలీసులకు చిక్కిన వారిలో 15,16 సంవత్సరాల యువకులే ఉన్నారు. ఉదయం ఏడు నుంచి 9.30 గంటల వరకు మధ్య మండలం అదనపు ఉపకమిషనర్‌ రామ్మోహనరావు, సైఫాబాద్‌ సహాయ కమిషనర్‌ సురేందర్ రెడ్డి, రాంగోపాల్‌పేట ఇన్‌స్పెక్టర్‌ గంగారెడ్డి, లేక్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ జానకమ్మ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు.

 బైక్ రేసింగ్

బైక్ రేసింగ్

నెక్లెస్‌రోడ్డులో బైక్‌ రేసింగ్‌లు జరుగుతున్నాయని సమాచారం అందడం, పలువురు వాకర్స్‌ ఫిర్యాదు చేయడంతో వారు నిఘా పెట్టారు. రేసర్లలో పదో తరగతి విద్యార్థులూ ఉండడం గమనార్హం. పీవీ ఘాట్‌ నుంచి ఐమాక్స్‌ చౌరస్తా వరకు వీరు రేసింగ్‌ నిర్వహిస్తున్నారు. రెండు వైపులా రోడ్డును జల్లెడ పట్టిన పోలీసులు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు.

 బైక్ రేసింగ్

బైక్ రేసింగ్

ఫలానాచోట బైక్‌ రేసింగ్‌లు నిర్వహిస్తున్నామని ఎవరికీ తెలియకూడదు. మనం అనుకున్న వారికి సమాచారం చేరితే చాలనుకుంటున్నారు యువత. ఇందుకోసం సోషల్‌ మీడియాలోని ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకుంటున్నారు.

 బైక్ రేసింగ్

బైక్ రేసింగ్

అందరి చేతుల్లోనే స్మార్ట్‌ఫోన్లు ఉండడంతో వాట్సప్‌ను వాడుకుంటున్నారు. ఈ సదుపాయం లేని సెల్‌ఫోన్లకు మాత్రం రెండు వాక్యాల్లో సమాచారం ఇస్తున్నారు.

 బైక్ రేసింగ్

బైక్ రేసింగ్

రేసింగ్‌ల్లో పాల్గొంటున్న వారంతా గ్రూపుగా ఉంటున్నారు. ఫేస్‌బుక్‌లో వారంతా నిరంతరం చాటింగ్‌లు చేసుకుంటున్నారు. చాటింగ్‌లో లేని వారికి మాత్రం ఫలానా చోట ఫలానా సమయానికి రేసింగ్‌ ఉంది. తప్పనిసరిగా రమ్మంటూ మెసేజ్‌ చేస్తున్నారు.

English summary
Photos of Hundreds of bike racing raider caught by police at necklace road.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X