వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరాసలోకి కవిత, బీజేపీలోకి రజనీ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ పునర్నిర్మాణంలో తమవంతు సాయం అందించేందుకే వివిధ పార్టీలకు చెందిన నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేర్కొన్నారు.

దీనిని ఓర్వలేక కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు తాను చిల్లర రాజకీయాలు చేస్తున్నానని విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.

చేరికలను తాము చిల్లర రాజకీయాలుగా భావించడం లేదని, తెలంగాణ పునర్నిర్మాణంతో పాటు, ప్రభుత్వానికి అండగా ఉండాలన్న లక్ష్యంతోనే వస్తున్నట్లు భావిస్తున్నామని చెప్పారు.

తెరాసలోకి

తెరాసలోకి

మంగళవారం తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌, మాజీ ఎమ్మెల్యే మాలోత్‌ కవితతో పాటు పలువురు నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు.

తెరాసలోకి

తెరాసలోకి

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోయినా, కనీసం తెలంగాణ అభివృద్ధికి సహకరించలేని కొందరు కాంగ్రెస్‌ నాయకులు ఓర్వలేకనే తమపై విమర్శలు చేస్తున్నారన్నారు.

తెరాసలోకి

తెరాసలోకి

అందరినీ కలుపుకుని పోయి నవతెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. గిరిజనులకు 12శాతం రిజర్వేషన్‌ కల్పించడంతో పాటు తండాల్లోని గిరిజనుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు కేసీఆర్‌ స్పష్టం చేశారు.

 తెరాసలోకి

తెరాసలోకి

ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ఆదివాసీ గిరిజనులకు కూడా 3ఎకరాల భూమిని ఇచ్చే పథకాన్ని అమలుచేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

తెరాసలోకి

తెరాసలోకి

బడ్జెట్‌ సమావేశాల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రెడ్యానాయక్‌ ఎంతో అనుభవజ్ఞులైన రాజకీయనాయకుడని, ఆయన సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని అన్నారు.

తెరాసలోకి

తెరాసలోకి

వరంగల్‌ జిల్లాలోని నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నా ఐక్యంగా పనిచేసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని ఆయన కోరారు.

తెరాసలోకి

తెరాసలోకి

ఈ కార్యక్రమంలో ఎంపీ సీతారామ్‌ నాయక్‌, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్‌, అరువు రమేష్‌, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 తెరాసలోకి

తెరాసలోకి

మంగళవారం తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌, మాజీ ఎమ్మెల్యే మాలోత్‌ కవితతో పాటు పలువురు నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు.

 తెరాసలోకి

తెరాసలోకి

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోయినా, కనీసం తెలంగాణ అభివృద్ధికి సహకరించలేని కొందరు కాంగ్రెస్‌ నాయకులు ఓర్వలేకనే తమపై విమర్శలు చేస్తున్నారన్నారు.

బీజేపీ

బీజేపీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వాడుతున్న భాష వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు.

బీజేపీ

బీజేపీ

కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానకార్యదర్శి రజనీ రెడ్డి మంగళవారం బీజేపీలో చేరారు. రజనీ రెడ్డిని కిషన్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

బీజేపీ

బీజేపీ

కేంద్ర ప్రభుత్వం మీద తెరాస నేతలు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని అవన్నీ అవాస్తవాలేనని తేలిపోయిందని కిషన్ రెడ్డి అన్నారు.

 బీజేపీ

బీజేపీ

విద్యుత్ కొరతను తీర్చేందుకు అవసరమైతే మహారాష్ట్ర ప్రభుత్వంతో తాము మాట్లాడతామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు.

బీజేపీ

బీజేపీ

రేషన్ కార్డుల జారీ, ఫించన్ల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను శాసనసభలో లేవనెత్తుతామని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.

బీజేపీ

బీజేపీ

పార్టీలో చేరిన సందర్భంగా రజనీ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ.. నరేంద్రమోడీ నాయకత్వాన్ని బలపరిచేందుకే తాను బీజేపీలో చేరినట్టు వెల్లడించారు.

English summary
Congress MLA from Dornakal in Warangal district D.S. Reddya Naik along with his daughter M. Kavitha, a former Congress MLA from Mahabubabad, joined the ruling TRS here on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X