కార్ల దొంగల ముఠా పట్టివేత: 35 కార్లు చోరీ (పిక్చర్స్)
హైదరాబాద్: అంతరాష్ట్ర వాహనాల దొంగల ముఠా గుట్టును హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా చోరీ చేసిన 35 కార్లలో పదమూడింటిని రికవరీ చేశారు. సూత్రధారితోపాటు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వివరాలను నగర పోలీస్ అదనపు కమిషనర్ స్వాతి లక్రా మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా రాగన్నగూడకు చెందిన సంగెపు చక్రధర్ పాత నేరస్థుడు. ఇతడిపై ముంబై, పుణె, ఢిల్లీలో కేసులుండగా 2009లో హైదరాబాద్ పోలీసులు కూడా అరెస్టు చేశారు. వంశీకృష్ణ, మెంగార కృష్ణకిశోర్, మురళీధర్, అన్నజీ అనే మారుపేర్లతో వివిధ రాష్ర్టాల్లో తిరుగుంటాడు. ప్రమాదాలు జరిగి పనికిరాకుండాఉండే కార్లను ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తాడు.
దేశవ్యాప్తంగా తాను ఏర్పాటుచేసుకున్న 20 మంది ముఠా సభ్యులతో వాహనాలు దొంగిలించి తీసుకురమ్మని సూచిస్తుంటాడు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల నుంచి వాహనాల స్క్రాప్‌ను కొంటూ పొరుగురాష్ర్టాల్లో దొంగిలించిన వాహనాలకు వాటి నంబర్లు వాడి, పూర్తిగా వాటి రూపురేఖలు మార్చేస్తాడు.

సూత్రధారి వంశీ
కార్ల చోరీల సూత్రధారి వంశీకి హైదరాబాద్ శివారులోని రాగన్నగూడ ప్రాంతంలో ఇతడికి ఒక షెడ్డు ఉన్నది. కారు నంబర్‌మార్చి, స్క్రాప్‌లో కొన్నకారు నంబర్‌తో ఆర్టీఏ కార్యాలయంలో పేరు మార్పిడి పంపిస్తాడు. ఇందుకు ఇతడికి తెలుగు రాష్ర్టాల్లో ప్రతిజిల్లాకు ఒక ఆర్టీఏ ఏజెంట్ ఉన్నాడు.

ఇలా వెలుగులోకి..
ఇటీవల నగర పోలీసులు నేరస్థులపై నిర్వహించిన సమగ్ర సర్వేలో పాత నేరస్థులపై ఆరా తీసి, వాహనాల దొంగలపై నిఘా పెట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ముఠా సభ్యులు
ప్రధాన నిందితుడితోపాటు తిరుపతికి చెందిన పేపకాయల శివ, తెనాలి వాసి గుంజ రత్నకిశోర్, నూజివీడుకు చెందిన కేతి శ్రీనివాస్‌రావు, మహారాష్ట్రకు చెందిన విజయ్ నసీబ్‌చంద్ దామన్, తన్వీర్ కాసమ్ భాగవన్‌లను అరెస్టు చేశారు.

డెమో ద్వారా చూపించారు....
ఉత్తరప్రదేశ్‌కు చెందిన నజీర్ అలియాస్ రాజు భాయ్ పరారీలో ఉన్నాడు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్, జాయింట్ సీపీ ప్రభాకర్‌రావు ఈ ముఠా వాహనాల్లోని భాగాలను ఎలా మారుస్తున్నారనే విషయాన్ని డెమో ద్వారా వివరించారు.

దేశవ్యాప్తంగా నెట్ వర్క్
ప్రధాన సూత్రధారి 20 మందితో దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ముఠా నుంచి 13 కార్లను స్వాధీనం చేసుకున్నారు.

రత్నకిశోర్
కార్ల చోరుల ముఠాలోని సభ్యుడు రత్న కిశోర్. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలికి చెందినవాడు.

శివ
వంశీ ఏర్పాటు చేసుకున్న కార్ల దొంగల ముఠాలోని శివ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతికి చెందినవాడు.

శ్రీనివాస్....
నిందితుల్లో ఒక్కడైన కేతి శ్రీనివాస రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నూజివీడుకు చెందినవాడు.

తన్వీర్...
ముఠా సభ్యుల్లో ఒక్కడైన తన్వీర్ కాసమ్ భాగవన్ మహారాష్ట్రకు చెందినవాడు.

విజయ్ దామన్
వంశీ సూత్రధారిగా ఏర్పడి కార్ల దొంగల ముఠాలో మహారాష్ట్రకు చెందిన విజయ్ దామన్ కూడా ఉన్నాడు.












Click it and Unblock the Notifications