కారులో మంటలు: ఓ చిన్నారి మృతి, ఆస్పత్రిలో మరొకతను (పిక్చర్స్)
హైదరాబాద్: పార్క్ చేసిన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఒక చిన్నారి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాదులోని మీర్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
సరూర్‌నగర్ మండలం జిల్లెలగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని గాయత్రీనగర్‌లో నివాసం ఉంటున్న సురేష్‌రెడ్డి కొడుకులు శ్రేయాన్‌రెడ్డి (10), సృజన్‌రెడ్డి (16) పార్కు చేసిన కారులో ఆడుకుంటుండగా ఈ ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కారులో తర్వాత పాటలు వినడానికి పెన్ డ్రైవ్ పెట్టగా, కారులో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. సృజన్‌రెడ్డి వెంటనే కారు నుంచి భయటకు దిగి అరవడంతో చుట్టు ప్రక్కలవారు చేరుకొని మంటలను నీళ్ళు పోసి మంటలను ఆదుపు చేశారు.

గుర్తించకపోవడంతో...
కారులో మంటలను అదుపు చేయడానికి నీళ్లు చల్లారు. అయితే కారు వెనుక భాగంలో శ్రేయాన్‌రెడ్డి ఉన్నట్లు ఎవరికీ తెలియదు. దీంతో అతను తీవ్రంగా గాయపడి మరణించాడు.

తల్లి చూసింది...
తల్లి వచ్చి చూసేసరికి కారులో అప్పటికే పూర్తిగా కాలిన గాయాలతో శ్రేయాన్ రెడ్డి ఉన్నట్లు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. 90శాతం గాయాలవటంతో దవాఖానలో చికిత్స పొందుతూ శ్రేయాన్‌రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

షార్ట్ సర్క్యూట్ వల్లనే...
సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కారులో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.

కన్నీరుమున్నీరుగా..
కొత్త సంవత్సరం రోజే ఇలాంటి సంఘటన జరగడంతో బాదిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.












Click it and Unblock the Notifications