వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరల్డ్ కాంగ్రెసు గర్వకారణం: ఈటెల (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్‌లో నిర్వహించనున్న మెట్రోపొలిస్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ సదస్సు ఎంతో ప్రతిష్ఠాత్మకమైందని, అందుకనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. గచ్చిబౌలిలోని సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవరెనెన్స్‌ కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో సోమవారం వర్క్‌షాప్‌ నిర్వహించారు.

11వ మెట్రో పొలిస్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ సదస్సును విజయవంతం చేసేందుకు పలు విభాగాల అధికారులు, వలంటీర్లు, ఇతర సంస్థలతో కలిసి విధివిధానాలను రూపొందించుకునేందుకు ఈ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో వరల్డ్‌ కాంగ్రెస్‌ సదస్సు జరగడం మనందరికీ గర్వకారణమని ఈటెల రాజేందర్ అన్నారు.

ప్రభుత్వ శా ఖల మధ్య సమన్వయ లోపంతో చేస్తున్న పనుల్లో నాణ్యత ఉండడం లేదని అధికారులకు చురకలంటించారు. ఏళ్ల తరబడి మన్నాల్సిన రోడ్లు మూన్నాళ్లకే పోతున్నాయన్నారు. సదస్సుకు 136 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. ఇంతటి విశి ష్టత కలిగిన సదస్సులో తెలంగాణ రాష్ట్రం ప్రాధాన్యాన్ని వినిపించి ప్రపంచ దేశాలను ఆకట్టుకునేందుకు, పెట్టుబడులను రాబట్టేందుకు అందరూ కృషి చేయాలన్నారు.

గొప్ప అవకాశం

గొప్ప అవకాశం

రాష్ట్రం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే 11వ మెట్రో పొలిస్ వరల్డ్ కాంగ్రెసును నిర్వహించే గొప్ప అవకాశం రాష్ట్రానికి కలిగినందుకు గర్వంగా ఉందని ఈటెల రాజేందర్ అన్నారు.

సంకేతాలు ఇవ్వాలి

సంకేతాలు ఇవ్వాలి

ప్రపంచ కాంగ్రెసు తెలంగాణ ప్రజలు ఆధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అభివృద్ధి చెందుతున్న దేశాలకు దీటుగా ఎదుగుతుందని సంకేతాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి రాజేందర్ అన్నారు.

ప్రాముఖ్యాన్ని చాటి చెప్పాలి

ప్రాముఖ్యాన్ని చాటి చెప్పాలి

వరల్డ్ కాంగ్రెసుతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, సంబంధ బాంధవ్యాలకు ఎంతగా ప్రాముఖ్యమిస్తారో చాటి చెప్పాలని ఈటెల రాజేందర్ అన్నారు.

చర్చలు జరిపారు

చర్చలు జరిపారు

సదస్సు నేపథ్యంలో నగరం నుంచి మేధావులు, రీసర్చ్‌స్కాలర్స్‌, పలు ఐటీ సంస్థలు హ్యాకథాన్‌ పేరుతో ఇది వరకే ఎలాంటి ప్రతిపాదనలు ఇవ్వాలనే దానిపై పలు రకాల చర్చలు జరిపారని రాజేందర్ అన్నారు.

పలువురు ప్రముఖులు

పలువురు ప్రముఖులు

కార్యక్రమంలో మాజీ చీఫ్‌ సెక్రటరీ పి.కె.మహంతి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ స్పెషల్‌ కమిషనర్‌ బాబు పాల్గొన్నారు.

అవార్డులు ప్రదానం

అవార్డులు ప్రదానం

బిగ్ హెల్ప్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర విద్యార్థులకు ప్రతిభా అవార్డుల కింద చెక్కులు ప్రదానం చేశారు.

బతుకమ్మ...

బతుకమ్మ...

బిగ్ హెల్ప్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా వారు బతుకమ్మ ఆడారు.

సాంస్కృతిక కార్యక్రమాలు

సాంస్కృతిక కార్యక్రమాలు

బిగ్ హెల్ప్ హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరనీ ఆకట్టుకున్నాయి.

English summary
Etela Rajender telangana finance minister, K.V.Ramanachary and others presenting 5000/- cheques ( Pratibha Awards) to merit students of govt highschools on monday at ravindrabharathi conference organised by Bighelp for education.Children presenting cultural programmes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X