ముందుగా గూగుల్ సెర్చ్, రెక్కీ: సినిమాలు తీయడానికి చోరీలు, ఎలా దొరికాడు (పిక్చర్స్)

హైదరాబాద్: బ్యాంక్ దోపిడీలు చేసి సినిమాలు తీయాలనే లక్ష్యంతో ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. బాలమురుగన్ అనే వ్యక్తి ఓ ముఠాను తయారు చేసుకుని చోరీలకు పాల్పడుతూ వచ్చాడు. చోరీలకు పథకాలు రచించడానికి సైబరాబాద్ పరిధిలోని కిస్మత్‌పురాను ఎంచుకున్నాడు. 2011లో అతను కిస్మత్‌పురాలో రూ. 50 లక్షలు విలువ చేసే ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాడిగా చలామణి అయ్యాడు.

ఈ విధంగా బాలమురుగన్ 2011 నుంచి 2015 వరకు 29 నేరాలకు పాల్పడ్డాడు. వీటిలో ఇంటి దొంగతనాలు, బ్యాంక్ దోపిడీలు ఉన్నాయి. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత డ్రైవర్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి సినీ ప్రముఖులతో పరిచయం పెంచుకున్న బాలమురుగన్ దోపిడీ డబ్బుతో రూ. కోటి బడ్జెట్‌తో సినిమాను రూపొందించి సంచలనాన్ని సృష్టించాడు.

2011లో సైబరాబాద్ పరిధిలోని కిస్మత్‌పురాకు వచ్చిన బాలమురుగన్ గ్యాంగ్ అంతకుముందు చోరీ చేసిన సోత్తుతో 50లక్షలు విలువ చేసే ఇల్లు కొన్నాడు. ఆ తర్వాత బాలమురుగన్ పోలీసు పాత్రలతో పేరొందిన ఓ ప్రముఖ హీరో దగ్గర డ్రైవర్‌గా చేరాడు. అలా ఏడాదిపాటు అతని దగ్గర పనిచేసి టాలీవుడ్‌లో పరిచయం చేసుకున్నాడు. కిస్మత్‌పురలో కూడా బాలమురుగన్ నిర్మాతగా చలామణి అయ్యాడు.

ఇలా దొరికాడు...

బాలమురుగన్ వ్యవహరం ఇబ్రహీంపట్నంలో వదిలి వెళ్లిన ఇన్నోవా కారుతో పోలీసులు క్లూ సంపాదించారు. అక్కడి నుంచి ప్రారంభమైన పోలీసుల విచారణ అతడి ఆస్తుల వరకు చేర్చించింది. అక్కడ దొరికిన సమాచారం మురుగన్ బయోడేటాను బయటపెట్టింది.

కారు నెంబర్లు, సెల్‌ఫోన్ ట్రాకింగ్‌తో మార్చిలో అతడి ఇంటి వరకు వెళ్లిన పోలీసులకు మురుగన్ చెక్మా ఇచ్చి పారిపోయాడు. అప్పటి నుంచి అతని అరెస్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమిళనాడు, బెంగళూరు పోలీసుల సహకారంతో చివరకు అతడిని నవంబరులో కర్ణాటక, తమిళనాడు సరిహద్దులో పట్టుకున్నారు.

మురుగన్ ఎవరు..

మురుగన్ ఎవరు..

మురుగన్ వ్యవహారాల గురించి సైబరాబాద్ పోలీసు కమిషనర్ మంగళవారం మీడియా సమావేశంలో వివరించారు. తమిళనాడు తిరువుర్ ప్రాంతానికి చెందిన బాలమురుగన్‌కు ఇద్దరు సోదరులు, నలుగురు సోదరీమణులు. మురుగన్‌కు మొదటి నుంచి ఓ సినిమా తీయాలని కోరిక.

అవకాశం ఇలా..

అవకాశం ఇలా..

మురుగన్ సోదరి కుమారుడు సురేష్‌కు సినిమా హీరో అవకాశాన్ని ఇచ్చాడు. దీని కోసం మురుగన్ అతడితో కలిసి 2008 నుంచి ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అందులో మెర్సిడిజ్ బెంజ్ కారు.. ఆపై ఖరీదైన కారులు ఉండే ఇళ్లను టార్గెట్ చేశాడు. ఈ దొంగతనాలు కూడా అతనికి సినిమా నిర్మాణానికి సరిపోదని తెలుసుకుని బ్యాంక్ దోపిడీలకు స్కెచ్ వేశాడు.

విజిటింగ్ కార్డులు..

విజిటింగ్ కార్డులు..

ఎన్‌బాల ప్రొడ్యూసర్ అంటూ విజిటింగ్ కార్డులు కొట్టించుకుని స్థానికంగా అందరినీ పరిచయం చేసుకున్నాడు. ఇలా సిని ప్రముఖుల పరిచయంతో సౌత్ ఇండియా ఫిలిం గిల్డ్‌లో ఎన్‌రాజమల్ ఫిలింస్ పేరుతో రిజిస్ట్‌ర్ చేసుకున్నాడు. ఓవైపు డ్రైవర్‌గా పని చేస్తూనే.. మురుగన్ బ్యాంక్ దోపిడీల స్కెచ్ వేశాడు.

గూగుల్ సెర్చ్, పథకాలు..

గూగుల్ సెర్చ్, పథకాలు..

బాలమురుగన్ ఈ బ్యాంక్ దోపిడీలకు తన పాత అనుచరుడు దినకరన్‌ను నగరానికి తీసుకువచ్చాడు. తన దోపిడీల కోసం గ్రామీణ బ్యాంక్‌లను ఎంచుకున్న మురుగన్ గూగుల్ సెర్చ్ ద్వారా నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే బ్రాంచీల వివరాలను సేకరిస్తాడు. ఆ తర్వాత మురుగన్ అనుచరుడు దినకరన్, మేనల్లుడు సురేష్, అతడి భార్య, పెంచుకున్న కుక్కను వెంట పెట్టుకుని దోపిడీలకు వెళతాడు.

గ్రిల్స్ తొలగించి..

గ్రిల్స్ తొలగించి..

టార్గెట్ చేసుకున్న బ్యాంక్‌ల కిటికీల గ్రిల్స్‌ను తొలగించి మురుగన్ దోపిడీలు చేస్తుంటాడని పోలీసు విచారణలో తేలింది. ఇదేవిధంగా ఘట్‌కేసర్‌లో గ్రామీణ బ్యాంక్‌లో దోపిడీ సమయంలో మంటలు ఎక్కువగా వచ్చి కొన్ని నోట్లు కాలిపోయాయి. అయితే, వాటిని బయటపడేయకుండా మురుగన్ భద్రంగా పెట్టుకున్నాడు.

నాలుగు బ్యాంకులు దోపిడీ..

నాలుగు బ్యాంకులు దోపిడీ..

మురుగన్ గత సంవత్సరం ఆగస్టులో మహబూబ్‌నగర్ బాలానగర్‌లో గ్రామీణ బ్యాంక్ దోపిడీ చేసి నాలుగు కోట్లు విలువ చేసే సొత్తను దోచుకున్నాడు. ఆ తర్వాత నవంబరులో చిత్తూరు వరదాయపాలెంలోని గ్రామీణ బ్యాంక్‌లో 55 లక్షలు చోరీ చేశాడు. డిసెంబర్‌లో ఘట్‌కేసర్ గ్రామీణ బ్యాంకులో 36 లక్షలు చోరీ చేశాడు. ఈ ఏడాది జనవరిలో ఇబ్రహీంపట్నం కోఆపరేటివ్ బ్యాంక్‌లో దోపిడీ యత్నానికి పాల్పడి ఇన్నోవా కారును వదిలి వెళ్లాడు.

మురుగన్ గ్యాంగ్ ఇలా...

మురుగన్ గ్యాంగ్ ఇలా...

మురుగన్ గ్యాంగ్ నాలుగు సంవత్సరాల్లో మొత్తం నాలుగు బ్యాంక్ దోపిడీలు, ఇళ్లల్లో దొంగతనాలకు సంబంధించి 29 నేరాలకు పాల్పడినట్లు విచారణలో తెలిసింది. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు మురుగన్ తన భార్యను ఎప్పుడు వెంటపెట్టుకుంటాడని పోలీసులు గుర్తించారు. ప్రతి దోపిడీకి మురుగన్ కొత్త సిమ్‌కార్డులు, పాత ఫోన్లను వాడుతుంటాడు. దోపిడీ తర్వాత వాటిని పక్కన పడేసి మళీక్ల కొత్త వాటితో ఆపరేషన్‌ను చేస్తాడు.

అతడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుసుకుని మూడు రాష్ర్టాల పోలీసులు ఆ చికిత్సను అందించే ఆసుపత్రుల వద్ద తిష్ట వేయడంతో అతను దొరికిపోయాడు. అతడు దొరికినా మరుగన్ అల్లుడు సురేష్, అనుచరుడు దినకరన్ పరారీలో ఉన్నారు.

దోపిడీ సొత్తుతో సినిమా..

మహబూబ్‌నగర్ బాలానగర్ దోపిడీలో మురుగన్ నాలుగు కోట్ల రుపాయాలను సంపాదించాడు. దీంతో తన సినిమా కలను తీర్చుకున్నాడు. మనస్సా వినవా.. పేరుతో తన అల్లుడు సురేష్ హీరోగా సినిమాను తీశాడు. రాజమండ్రిలో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవ ముహూర్తానికి డీఎస్పీ, ఆర్డీఓ స్థాయి అధికారులను ఆహ్వానితులుగా పిలిపించాడు.

మరో సినిమాకు ఆత్మ పేరుతో కథను కూడా రెడీ చేసుకున్నాడు. మనస్సా వినవా హీరోయిన్‌కు 6 లక్షల పారితోషికాన్ని మురుగన్ చెల్లించాడు. విడుదల సమయంలోనే మరుగన్ పోలీసులకు దొరకడంతో అతడి సినిమా సిల్వర్ స్క్రీన్ మీదకు రాకుండానే నిలిచిపోయింది.

మురుగన్ వద్ద 71.25 లక్షల నగదుతో పాటు కోటి విలువ చేసే సొత్తును పోలీసులు రికవరీ చేశారు. మురుగన్‌పై బెంగళూరులో మొత్తం 20 నాన్‌బెయిలబుల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులో మురుగన్ ఆచూకీని కనుగొన్న సిబ్బందిని సైబరాబాద్ సీపీ ప్రత్యేకంగా అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+