గద ఎత్తిన హరీష్: 'చిందే'సిన ఆర్టిస్టులు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని మరో ప్రజా ఉద్యమంలా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కొత్త రాష్ట్రంలో తొలి బడ్జెట్‌లో చెరువుల పునరుద్ధరణ కోసం రూ.22,500 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. శుక్రవారం రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘మన ఊరు-మన చెరువు' కార్యక్రమంపై చిందు యక్షగాన కళాకారుల శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.
చెరువులపై ప్రజల్లో చైతన్యం కలిగించాలన్న లక్ష్యంతో తొలిసారిగా చిందు యక్షగాన కళాకారులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆట, పాటలతో ప్రముఖ పాత్ర పోషించిన కళాకారులందరినీ ఇందులో భాగస్వాములను చేస్తామని చెప్పారు.
పూడికతీత కార్యక్రమంకోసం ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. విదేశాల్లో ఉన్నవారు తమ గ్రామాల్లో చెరువుల అభివృద్ధి కోసం నిధులను కేటాయించేందుకు ఆసక్తి చూపుతున్నారని, అలాంటి వారిని ప్రోత్సహిస్తూ అక్కడి చెరువులకు వారి సూచించిన పేర్లు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.

హరీష్ రావు ఇలా..
మన ఊరు - మన చెరువు కార్యక్రమంపై చిందు యక్షగాన కళాకారుల శిక్షణా శిబిరం కార్యక్రమంలో తెలంగాణ మంత్రి హరీష్ రావు ప్రసంగించారు.

కళాకారులు ఇలా...
మన ఊరు - మన చెరువు కార్యక్రమంపై చిందు యక్ష గాన శిక్షణా శిబిరంలో కళాకారులు ఇలా కనిపించారు.

చిందు యక్షగాన కళాకారులు ఇలా..
మన ఊరు - మన చెరువు కార్యక్రమంపై చిందు యక్షగాన శిక్షణా శిబిరంలో రవీంద్ర భారతి వద్ద కళాకారులు ఇలా..

కళా ప్రదర్శన ఇలా..
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన చిందు యక్షగాన శిక్షణా శిబిరంలో కళాకారులు ఇలా ప్రదర్సన ఇచ్చారు.

కళాకారులు ఇలా...
మన ఊరు - మన చెరువు కార్యక్రమంపై ఏర్పాటు చేసిన చిందు యక్ష గాన శిక్షణా శిబిరంలో కళాకారులు ఇలా ప్రదర్శన ఇచ్చారు.

కళాకారులతో హరీష్ రావు ఇలా..
చిందు యక్షగాన కళాకారులతో రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇలా..












Click it and Unblock the Notifications