ఎసిబి వలలో అవినీతి చేపలు ఇలా.. (పిక్చర్స్)
కరీంనగర్: ఒక ప్రభుత్వ వైద్యుడి నుంచి 60 వేలు లంచం తీసుకుంటూ కరీంనగర్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొమురం బాలు, సీనియర్ అసిస్టెంట్ స్వామిలు సోమవారం అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)కు దొరికి పోయారు. కరీంనగర్ జిల్లా వీణవంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న డాక్టర్ సుధాకర్‌రావ జమ్మికుంటలో పోస్టింగ్ ఇవ్వాలని డీఎంహెచ్‌ఓను విజ్ఞప్తి చేశాడు.
అందుకు 50 వేల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో సుధాకర్‌రావు ఏసీబీని ఆశ్రయించాడు. పథకం ప్రకారం 50 వేలతో పాటు స్వామికి మరో 10 వేలు ఇస్తుండగా స్వామిని, కొమురం బాలును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
సుధాకర్ రావు డిప్యూటేషన్లను రద్దు చేయడానికి డబ్బులు వసూలు చేశారు. డిప్యూటేషన్లతో వేధించడమే కాకుండా వాటి రద్దుకు డబ్బులు డిమాండ్ చేస్తూ వచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. డిఎంహెచ్‌ఓ వైఖరితో విసిగిపోయిన సుధాకర్ రావు ఎసిబి అధికారులను సంప్రదించారు. దాంతో పథకం ప్రకారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో వారికి 60 వేల రూపాయలు ముట్టజెప్పుతుండగా ఎసిబి డిఎస్పీ సుదర్శన్ గౌడ్ తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు.

ఎసిబి వలలో..
కొమరం బాలకు హన్మకొండలో ఇల్లు ఉంది. ఇక్కడ దాడిచేసిన ఎసిబి అధికారులు అక్కడి ఇంట్లోనూ తనిఖీలు చేశారు.

ఎసిబి వలలో..
తనను పట్టుకున్న ఎసిబి అధికారులతో డిఎంహెచ్ఓ కొమరం బాలు మొదట వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో మీడియా ప్రతినిధులు రావడంతో ఆందోళనకు గురైన ఆయన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.

ఎసిబి వలలో..
కొమరం బాలు ఆందోళనకు గురి కావడంతో మీడియా ప్రతినిధులను ఎసిబి అధికారులు ఆ గదిలోకి అనుమతించలేదు.

ఎసిబి వలలో..
డిప్యూటేషన్లతో వేధిస్తూ డిఎంహెచ్ఓ కొమరం బాలు సుధాకర్ రావును వేధిస్తున్నాడంటూ, పైగా లంచాలు అడుగుతున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications