వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెటిఆర్ 'అట'విడుపు: ఓ వైపు నాగార్జున, మరో వైపు వెంకటేష్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఇటీవలి వరకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ రాజకీయ వ్యవహారాల్లోనూ తలమునకలైన తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ఆదివారం సాయంత్రం ఆటవిడుపుగా సిసిఎల్ మ్యాచును వీక్షించారు.

ఉప్పల్ క్రికెట్ మైదానంలో ఇద్దరు సినీ నటుల మధ్య కూర్చుని ఆయన సినీ స్టార్ల క్రికెట్ మ్యాచును తిలకించారు. తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచును ఆయన చూశారు. ఆయన కోసమే అన్నట్లుగా తెలుగు వారియర్స్ ఫైనల్లో విజయం సాధించారు.

సినిమాల్లో తాను నాగార్జున అభిమానిని అని ఆయన చెప్పుకున్నారు. తనకు ట్వంటీ20 మ్యాచులంటే ఇష్టమని చెప్పారు. సినీ నటులు వెంకటేష్, రానాలతో కలిసి తాను మ్యాచులు వీక్షించినట్లు తెలిపారు.

నాగ్, వెంకటేష్‌ల జోష్‌కు కెటిఆర్ తోడు

నాగ్, వెంకటేష్‌ల జోష్‌కు కెటిఆర్ తోడు

తెలుగు వారియర్స్ విజృంభించినప్పుడు నాగార్జున, వెంకటేష్ లేచి నిలబడి హర్షధ్వానాలు చేస్తే కెటిఆర్ కూర్చుండే వారికి తోడుగా నిలిచారు.

వెంకటేష్‌తో జాలీగా ఇలా...

వెంకటేష్‌తో జాలీగా ఇలా...

ఉప్పల్ స్టేడియంలో వెంకటేష్, రానాల పక్కన కూర్చుని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఉల్లాసంగా ఇలా కనిపించారు.

సిక్స్ అంటూ నాగ్, కెటిఆర్ కరతాళ ధ్వనులు...

సిక్స్ అంటూ నాగ్, కెటిఆర్ కరతాళ ధ్వనులు...

సిక్స్ అన్నట్లుగా నాగార్జున రెండు చేతులు పైకి ఎత్తి ఇలా కనిపిస్తే, కెటిఆర్ లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేశారు.

అయ్యారే ఇలా..

అయ్యారే ఇలా..

సినీ నటులు వెంకటేష్, నాగార్జున మధ్య తెలంగదాణ ఐటి శాఖ మంత్రి నవ్వుల పువ్వుల పూయిస్తూ ఇలా కనిపించారు.

నాగార్జునతో ముచ్చటిస్తూ...

నాగార్జునతో ముచ్చటిస్తూ...

వెంకటేష్ సీరియస్‌గా క్రికెట్ క్రీడను వీక్షిస్తుంటే, కెటిఆర్ తనకు ఇష్టమైన నటుడు నాగార్జునతో ఇలా ముచ్చట్లాడారు.

ఇలా గంభీరంగానూ...

ఇలా గంభీరంగానూ...

సిసిఎల్ క్రికెట్ వీక్షిస్తూ నాగార్జున నవ్వులతో తేలిపోతుంటే, కెటిఆర్, వెంకటేష్ ఇలా సీరియస్‌గా మ్యాచ్ చూస్తూ కనిపించారు.

English summary
Telangana minister KT Rama rao said that he is a fan of Nagarjuna and interested Twenty20 cricket match.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X