హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్యం మత్తులో లారీ నడిపిన డ్రైవర్: కానిస్టేబుల్ బలి (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీస్ చెక్‌పోస్టుపైకి అర్ధరాత్రి రెడీమిక్స్ లారీ దూసుకొని రావడంతో ఒక కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాందేవ్‌గూడ ప్రధానరోడ్డులో జరిగింది. రాహుల్ యాదవ్ అనే కానిస్టేబుల్ మరణించాడు.

బక్రీద్ పండుగ నేపథ్యంలో ఆవుల తరలింపుపై నిఘా పెంచేందుకు శివారు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. గోల్కొండ ఠాణా పరిధిలో రాందేవ్‌గూడ వద్ద ఫుట్‌పాత్‌పై తాత్కాలిక గుడారంతో చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి కానిస్టేబుళ్లు రాహుల్‌యాదవ్, పవన్‌కుమార్, వీరేందర్‌గౌడ్, సైదులు విధినిర్వహణలో ఉన్నారు.

రెడీమిక్స్ లారీ డ్రైవర్ యాదిరెడ్డి మద్యం మత్తులో నగరానికి లారీతో బయలుదేరాడు. చెక్‌పోస్ట్ వద్ద బారికేడ్లను ఢీకొడుతూ వేగంగా వచ్చి, ఫుట్‌పాత్‌కు తగిలి లారీ బోల్తాపడింది. కానిస్టేబుళ్లు తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారు. రాహుల్‌యాదవ్‌పై లారీ అమాంతం పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

పవన్ కుమార్‌కు గాయాలు

పవన్ కుమార్‌కు గాయాలు

చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లపైకి లారీ దూసుకుని వెళ్లడంతో గాయపడిన పవన్ కుమార్ ఇతనే.

మృతి చెందిన రాహుల్

మృతి చెందిన రాహుల్

చెక్‌పోస్టుపైకి దూసుకొచ్చిన లారీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రాహుల్ యాదవ్ అనే కానిస్టేబుల్ ఈ ప్రమాదంలో మరణించాడు.

సైదులు ఇతనే...

సైదులు ఇతనే...

తాగిన మత్తులో లారీని నడుపుతూ డ్రైవర్ చెక్‌పోస్టుపైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు కానిస్టేబుళ్లలో సైదులు ఇతనే..

వీరేంద్ర గౌడ్ ఇతనే..

వీరేంద్ర గౌడ్ ఇతనే..

విధులు నిర్వహిస్తూ లారీ దూసుకురావడంతో ప్రమాదానికి గురైన కానిస్టేబుల్ వీరేంద్ర గౌడ్ ఇతనే. వీరేంద్రగౌడ్‌కు తలకు బలమైన గాయమైంది.

ఆస్పత్రిలో చికిత్స

ఆస్పత్రిలో చికిత్స

ప్రమదాంలో గాయపడిన వీరేందర్‌గౌడ్, పవన్‌లను ఆపోలో, సైదులును కేర్ ఆస్పత్రికి రలించారు. చికిత్స పొందుతున్న కానిస్టేబుళ్లను డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పరామర్శించారు.

వీరేంద్ర గౌడ్‌కు శస్త్రచికిత్స

వీరేంద్ర గౌడ్‌కు శస్త్రచికిత్స

వీరేంద్రగౌడ్‌కు శస్త్రచికిత్స చేశామని, 48 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచామని వైద్యులు చెప్పారు. తర్వాత ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి రాహుల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కూడా కానిస్టేబుళ్లను పరామర్శించారు.

బయటపడిన విజయ్ కుమార్

బయటపడిన విజయ్ కుమార్

ప్రమాదం జరిగిన సమయంలో మూత్రవిసర్జనకు వెళ్లడంతో హెడ్ కానిస్టేబుల్ నిజయ్ కుమార్ యాదవ్ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాడు.

ప్రమాదం ఇలా..

ప్రమాదం ఇలా..

ఎన్ఎంఆర్ ప్లాంట్‌కు చెందిన రెడీమీక్స్ లారీ నార్సింగ్ ప్లాంట్ నుంచి కాంక్రీట్ తీసుకుని బండ్లగూడకు వెళ్తోంది. డ్రైవర్ చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు దగ్గరకు వచ్చేసరికి కూడా గమనించలేదు. లారీని పోలీసులు టెంట్ వేసుకుని ఉన్న ఫుట్‌పాత్‌పైకి తిప్పాడు. దీంతో అది పోలీసులపైకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది.

English summary
A constable Rahul Yadav killed as lorry rammed into the check post in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X