Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రోజంతా డ్రామా: మధుప్రియ ట్విస్ట్, ఎందుకు? (పిక్చర్స్)

హైదరాబాద్: సింగర్ మధుప్రియ, భర్త శ్రీకాంత్ డ్రామా ఆదివారమంతా నడిచింది. భర్త శ్రీకాంత్‌పై శనివారంనాడు మధుప్రియ ఫిర్యాదుతో మొదలైన వేడి ఇరువురిని కూర్చోబెట్టి కౌన్సెలింగ్ చేయడంతో చల్లారింది. భర్త శ్రీకాంత్‌పై మధుప్రియ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.

సోమరిపోతు, తాగుబోతు అంటూ అని ఆరోపించడమే కాకుండా నా కొడుకులాంటోళ్లు... అంటూ వ్యాఖ్యానించింది. తనను మానసికంగా, శారీరకంగా హింసించాడని ఆరోపించింది. అయితే, శ్రీకాంత్ ఆమె చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే ఉరేసుకుంటానని వ్యాఖ్యానించాడు.

ముఖానికి గాయాలతో అతను కౌన్సెలింగ్‌కు హాజరు కావడమే కాకుండా టీవీ చర్చా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాడు. ఒకానొక సందర్భంలో శ్రీకాంత్ డ్రామా ఆడుతున్నాడని కూడా అనిపించింది. ఆయనపై మధుప్రియ ఇంటి వద్ద దాడి జరిగిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే, చివరగా మా ఆయన మంచోడంటూ కితాబు ఇచ్చి కలిసి ఉండడానికి సమయం కావాలని కోరింది. మధుప్రియ వ్యవహార శైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మా ఆయన మంచోడే అంటూ సింగర్ మధుప్రియ ఆదివారం రాత్రి ట్విస్ట్ ఇచ్చారు. పోలీసుల కౌన్సెలింగ్ అనంతరం ఆమె మీడియాతో ఆ మాట అన్నారు. కానీ, ఆయనతో వెళ్లడానికి తనకు సమయం కావాలని చెప్పింది. మధుప్రియ ఆరునెలల క్రితం పెద్దలను ఎదిరించి, శ్రీకాంత్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే తన భర్త చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ మధుప్రియ శనివారం పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాత పలు నాటకీయ పరిణామాల అనంతరం 24 గంట హైడ్రామకు తెర పడింది. పోలీసుల కౌన్సిలింగ్ ఫలించింది. ఆదివారం ఇరు పక్షాలకు కౌన్సిలింగ్ ఇచ్చిన హుమాయున్‌నగర్ పోలీసులు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు.

రాజీ అనంతరం శ్రీకాంత్ ప్రవర్తన మంచిగానే ఉందని, ఆయనకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని మధుప్రియ చెప్పింది. అయితే మరో 10 రోజులు తనకు సమయం కావాలని, అప్పటివరకూ తల్లిదండ్రుల వద్దే ఉంటానని మధుప్రియ తెలిపింది. దాదాపు ఐదు గంటల పాటు పోలీసుల కౌన్సిలింగ్ కొనసాగింది. శ్రీకాంత్ కూడా సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం. మరో రెండు రోజుల తర్వాత మరోసారి వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు.

ఇద్దరికీ కౌన్సెలింగ్

ఇద్దరికీ కౌన్సెలింగ్

మధుప్రియకు, శ్రీకాంత్‌కు పోలీసులు కౌన్సెలింగ్ ఇప్పించారు. ముగ్గురు మహిళా సైకాలిజిస్టులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

నెమ్మదించారు...

నెమ్మదించారు...

కౌన్సెలింగ్ తర్వాత మధుప్రియ, శ్రీకాంత్ మధ్య సయోధ్య కుదిరినట్లే కనిపించింది. తాను మధుప్రియను ఇంటికి తీసుకుని వెళ్తానని శ్రీకాంత్ చెప్పగా, తనకు కొంత సమయం కావాలని మధుప్రియ అడిగింది.

మా ఆయన మంచోడు...

మా ఆయన మంచోడు...

రెండు రోజుల తర్వాత మధుప్రియకు, శ్రీకాంత్‌కు మరోసారి పోలీసులు కౌన్సెలింగ్ ఇప్పించనున్నారు. కౌన్సెలింగ్ తర్వాత తాను ఇచ్చిన ఫిర్యాదుపై శ్రీకాంత్ మీద చర్యలు తీసుకోవద్దని మధుప్రియ పోలీసులను కోరింది.

దాడిలో గాయపడిన శ్రీకాంత్

దాడిలో గాయపడిన శ్రీకాంత్

ఆదివారం రాత్రి తనను మాట్లాడడానికి పిలిపించి తనపై మధుప్రియ ఇంటి వద్ద దాడి చేయించారని శ్రీకాంత్ ఆరోపించాడు. గాయాలకు కట్లతోనే అతను కౌన్సెలింగ్‌లో పాల్గొన్నాడు.

శ్రీకాంత్ ఇలా...

శ్రీకాంత్ ఇలా...

తన భార్య మధుప్రియ ఆమె తల్లిదండ్రులకు ఎటిఎం మెషిన్ లాగా పనిచేస్తోందని శ్రీకాంత్ ఆరోపించాడు. మధుప్రియ చెప్పిన విషయాల్లో నిజం లేదని అన్నాడు.

రాజీ తర్వాత

రాజీ తర్వాత

రాజీ అనంతరం శ్రీకాంత్ ప్రవర్తన మంచిగానే ఉందని, ఆయనకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని మధుప్రియ చెప్పింది. అయితే మరో 10 రోజులు తనకు సమయం కావాలని, అప్పటివరకూ తల్లిదండ్రుల వద్దే ఉంటానని మధుప్రియ తెలిపింది.

పెద్దలు చెప్పిన మాట విననందుకు...

పెద్దలు చెప్పిన మాట విననందుకు...

తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా పెళ్లి చేసుకున్నందుకు తనకు తగిన శాస్తి జరిగిందని మధుప్రియ తొలుత వ్యాఖ్యానించింది.

నా భవిష్యత్తు బాగానే...

నా భవిష్యత్తు బాగానే...

శ్రీకాంత్‌తో విడిపోయిన తర్వాత కూడా తన భవిష్యత్తు బాగానే ఉంటుందని, వేదికపై తాను తగిన ప్రదర్శన చేస్తున్నానని మధుప్రియ అన్నది.

స్పహ తప్పి పడిపోయిన మధుప్రియ

స్పహ తప్పి పడిపోయిన మధుప్రియ

శనివారం అర్థరాత్రి పోలీసు స్టేషన్ వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. శ్రీకాంత్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఒకానొక సందర్భంలో ఆమె స్పృహ తప్పి పడిపోయింది.

తల్లిదండ్రులతో ఇలా...

తల్లిదండ్రులతో ఇలా...

తల్లిదండ్రులతో పోలీసు స్టేషన్‌కు వచ్చిన మధు ప్రియ శనివారం రాత్రి శ్రీకాంత్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. తొలుత బాగానే ఉండేవాడని, ఆ తర్వాత హింసించడం ప్రారంభించాడని ఆరోపించింది.

దాడి జరిగిన తర్వాత..

దాడి జరిగిన తర్వాత..

శనివారం రాత్రి తనపై దాడి జరిగిన తర్వాత శ్రీకాంత్ మీడియాతో మాట్లాడి ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. శ్రీకాంత్ తన అనుచరులతో దాడికి వచ్చాడని మధుప్రియ తల్లిదండ్రులు ఆరోపించారు.

శ్రీకాంత్ అనుకుని...

శ్రీకాంత్ అనుకుని...

శ్రీకాంత్‌ అని భ్రమపడి శనివారం అర్థరాత్రి మహ్మద్‌ నయీమ్‌ అనే వ్యక్తిని మధుప్రియ బంధువులు చితకబాదారు. రామంతాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో ఆ యువకుడికి చికిత్సనందిస్తున్నారు. అయితే ఆ వ్యక్తి శ్రీకాంత్‌తో పాటు మధుప్రియ ఇంటికి వెళ్లిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మధుప్రియ బంధువులపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+