నోటుకు ఓటు, ఫోన్ ట్యాపింగ్‌లపై హైకోర్టులో పిల్

హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపులపై సోమవారం హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ మూడు వ్యవహారాలపై సిబిఐతో విచారణ జరిపించాలని కోరుతూ పివి కృష్ణయ్య అనే న్యాయవాది సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

హైదరాబాదులో సెక్షన్ 8ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా ఆయన హైకోర్టును కోరారు. పిటిషన్ విచారణ అర్హతను హైకోర్టు ప్రశ్నించింది. పిటిషన్‌పై విచారణ చేపట్టాలంటే రెండు వారాల్లో లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలని హైకోర్టు కృష్ణయ్యను ఆదేశించింది.

PIL filed in High court on Cash for vote

హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనంపై పిటిషన్

హైదరాబాదులోని హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం ఆపాలని దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. 15 అడుగులలోపు విగ్రహాలను నిమజ్జనంచేస్తే అభ్యంతరం ఏమిటని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. దీని వల్ల వచ్చే సమస్యలు ఏమి లేవని హైకోర్టు తెలిపింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 27కు కోర్టు వాయిదా వేసింది.

బెంగళూరు తరహాలో హైదరాబాదులో వినాయ నిమజ్జనం జరిపేలా ఆదేశించాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. దాని సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించాలని హైకోర్టు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి)ని ఆదేశించింది.

వినాయక చవితి సందర్భంగా యేటా గణేశుడి విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, బెంగళూరులో లోతుగా తవ్విన గుంతల్లో నీళ్లను నింపి అందులో విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు. అయితే, దీన్ని హిందూ సంప్రదాయవాదులు వ్యతిరేకిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+