ఇక మీ ఇష్టం: కేసీఆర్‌కు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆఫర్
న్యూఢిల్లీ: తెలంగాణకు కోరినన్ని విద్యుత్తు ప్రాజెక్టులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ బుధవారం విలేకరులతో చెప్పారు. మెదక్ జిల్లాలోని శంకరంపల్లిలో ప్రాజెక్టుకు గ్యాస్‌ను సరఫరా చేయాల్సిన బాధ్యత పెట్రోలియం శాఖ పైన ఉందని తెలిపారు.
కేజీ బేసిన్‌లో గ్యాస్ విరివిగా లభిస్తున్నందున గ్యాస్ కేటాయింపు సమస్యలు తలెత్తబోవని చెప్పారు. రామగుండంలో ఇప్పటికే 800 మెగావాట్ల ప్లాంట్లు రెండింటిని ఎన్టీపీసీ ప్రారంభించిందని ఇంకా అదనపు ప్లాంట్లు కావాలా, వద్దా అన్నది తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకోవాలని అల్టిమేటం జారీ చేశారు.
పీపీఏల ద్వారా కొనుగోలు చేసే విద్యుత్ తక్కువ ఖర్చుకే వస్తుందనుకున్నప్పుడు ఎక్కువ ప్రాజెక్టులను చేపట్టడానికి కొన్ని ప్రభుత్వాల ముందుకు రావడం లేదన్నారు.
తెలంగాణ అంగీకరిస్తే విద్యుత్ కేంద్రాలు నిర్మిస్తామని చెప్పారు. రామగుండంలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి గాను ఇప్పటికే 800X2 చొప్పున 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులు ప్రారంభమయ్యాయని, మిగతా యూనిట్ల నిర్మాణానికి అవసరమైన భూమి గురించి ఎన్టీపీసీ, రాష్ట్రం మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు.
మిగిలిన మూడు యూనిట్ల నిర్మాణం కూడా ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం తనను అడిగిందని, ఎన్టీపీసీ అందుకు సుముఖంగా ఉందని చెప్పారు. అయితే ఆ యూనిట్ల నిర్మాణాన్ని ప్రారంభించాలనుకున్నారా లేదంటే విద్యుత్ బయటి నుంచి కొనుగోలు చేయాలనుకుంటున్నారా అన్న దాని పైన పునసమీక్షించి నిర్ణయం చెప్పాలన్నారు.

కేసీఆర్, పీయూష్ గోయల్
తెలంగాణకు కోరినన్ని విద్యుత్తు ప్రాజెక్టులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ బుధవారం విలేకరులతో చెప్పారు.

పీయూష్ గోయల్
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అంతకుముందు పుట్టపర్తిలో జరిగిన సత్య సాయి వరల్ట్ యూత్ ఫెస్టివెల్‌లో పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.

Click it and Unblock the Notifications