ప్రగతి భవన్ నుంచి సీక్రెట్ ఫొటోలు బయటకు..!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనుహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన సంఖ్యను కాంగ్రెస్ ఈజీగా క్రాస్ చేసింది. దీంతో ఆ పార్టీ నాయకులు ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ద చేసుకుంటున్నారు. ఈ ఫలితాలతో బీఆర్ఎస్ నాయకులు పూర్తి నిరాశలో కురుకుపోయారు.
కనీసం 50 సీట్లు సాధించి మరోసారి అధికారం చేపడదామని భావించిన అధికార పార్టీ నేతలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇలాంటి ఫలితాలను వస్తాయని బీఆర్ఎస్ శ్రేణులు ఊహించలేదు. ఓటమిపై కేటీఆర్, హరీష్ రావులు స్పందించారు. మాకు ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవడంతో ఖచ్చితంగా నిరాశ చెందామని..మళ్లీ పుంజుకుంటామని కేటీఆర్ ట్వీట్ చేశారు.

గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచిన ప్రజలు..ఇప్పుడు కాంగ్రెస్‌కు ఆదరించారని .. ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పాలన సాగాలని కోరుకుంటున్నా అంటూ హరీష్ రావు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రగతి భవన్‌లో విభిన్న వాతవరణం నెలకొంది. ఇన్ని రోజులు బీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలతో కళకళలాడిన ప్రగతి భవన్ ..ఇప్పుడు వెలవెలబోతుంది.

తెలంగాణాలో కాంగ్రెస్ విజయం వెనక చంద్రబాబు హస్తం ఉందని భావిస్తున్నారా ..??#Chandrababu #RahulGandhi #RevanthReddy #TelanganaAssemblyElectionResults2023 #ElectionResults #ElectionResults2023 #AssemblyElections2023 #ResultsWithOneindia #Oneindiatelugu
— oneindiatelugu (@oneindiatelugu) December 3, 2023
బీఆర్ఎస్ ఓడిపోవడంతో ప్రగతి భవన్‌ను ఖాళీ చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆ భవన్‌లో ఉన్న కేసీఆర్, కేటీఆర్ ఫొటోలను తొలగిస్తున్న చిత్రం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలు స్పందిస్తూ..ప్రగతి భవన్ నుంచి సీక్రెట్ ఫొటోలు బయటకు వెళ్లిపోతున్నాయంటూ..తిరిగి వచ్చే అవకాశం లేదంటే కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications