బీజేపీ అధ్యక్ష ఖరారు వేళ కీలక పరిణామాలు..!!
బీజేపీ నాయకత్వం వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆచి తూచి వ్యవహరిస్తోంది. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ నాయకత్వానికి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్న వేళ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. జాతీయ అధ్యక్షుడితో పాటుగా పలు రాష్ట్రాలకు బీజేపీకి కొత్త అధ్యక్షులను ఖరారు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తి చేసారు. కాగా, ప్రధాని మోదీ ఎంపిక నిర్ణయాలు అనూహ్యంగా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఢిల్లీ బీజేపీ నేతల నిర్ణయాలు ఉత్కంఠ పెంచుతున్నాయి.
కొత్త అధ్యక్షుడిగా
బీజేపీకి జాతీయ అధ్యక్షుడు రానున్నారు. పార్టీపై పూర్తిగా పట్టుబిగించి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయనున్న బలమైన నేతనే పార్టీ అధ్యక్షుడుగా నియమించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేతలకు, బీజేపీ అగ్రనేతలకు మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, హరియాణా సహా పలు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను నియమించేందుకు కూడా కసరత్తు పూర్తయినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. అలాగే.. పార్టీలో సిద్దాంతానికి కట్టుబడి ఉండే నేతలను ప్రధాన కార్యదర్శులుగా, కార్యదర్శులుగా నియమించేలా రంగం సిద్దమైంది. ప్రధాని మోదీ మార్క్ ఈ ఎంపికల్లో స్పష్టం కానుంది.

ఆరెస్సెస్ ముద్ర
ఈ నెల 20వ తేదీ తరువాత ఎప్పుడైనా పార్టీ చీఫ్ తో పాటుగా రాష్ట్రాల అధ్యక్షుల పైన అధికారికం గా ప్రకటన చేయనున్నారు. పార్టీలోనూ సమూల ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. అధ్యక్షుడి ఖరారులో ఈ సారి పూర్తిగా పార్టీలో పని చేసిన వారికే అవకాశం ఇవ్వనున్నారు. సామాజిక లెక్కలతో పాటుగా ప్రాంతీయ - విధేయత ఆధారంగా అధ్యక్షులను ఎంపిక చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో నూ ఆరెస్సెస్ ముద్ర ఉన్న వారికే అధ్యక్ష పదవులు దక్కుతాయని తెలుస్తోంది. నూతన అధ్యక్షు డు వచ్చిన తర్వాత 50 శాతం జాతీయ ప్రధాన కార్యదర్శులను తొలగించే అవకాశం ఉందని సమాచారం. దీంతో పాటు, కొత్త అధ్యక్షుడి బృందంలో యువ నాయకులకు ప్రధాన కార్యదర్శులు గా అవకాశం దక్కనుంది. తెలుగు రాష్ట్రాల విషయంలోనూ ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా ఎంపిక దిశగా మార్గనిర్దేశం చేసినట్లు సమాచారం.
మోదీ మార్క్ ఎంపిక
తెలంగాణ, ఏపీ బీజేపీ అధ్యక్షుల పైన ఇప్పటి పార్టీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రస్తుతం పలువురు నాయకుల పేర్లు చివరి వరకు రేసులో ఉన్నాయి. కాగా, బీజేపీ బీసీ కార్డుతో వచ్చే ఎన్నికలకు వ్యూహాలను సిద్దం చేస్తోంది. అందులో భాగంగా ఆరెస్సెస్ నేపథ్యం.. సమర్ధుడుగా పార్టీ నేతల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకు కొత్త అధ్యక్షుడిని ఖరారు చేసారు. మంత్రివర్గ విస్తరణలోనూ తెలంగాణ నుంచి మార్పులు ఖాయమని తెలుస్తోంది. ఏపీలో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆరెస్సెస్ నేపథ్యం.. సుదీర్ఘ కాలంలో పార్టీలో పని చేస్తున్న నేతను ఎంపిక చేసినట్లు సమాచారం. వచ్చే వారం వీరి పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications