తెలంగాణకు నేడు ప్రధాని మోదీ - దూరంగా సీఎం కేసీఆర్: పీఎం కౌంటర్ ఇస్తారా..!!
ప్రధాని మోదీ మరి కొద్ది గంటల్లో తెలంగాణకు రానున్నారు. టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ అనే విధంగా రాజకీయం మారిన పరిస్థితుల్లో ప్రధాని తెలంగాణ పర్యటన ఉత్కంఠగా మారుతోంది. ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రధాని మోదీ పర్యటన అధికారిక కార్యక్రమం అయినా సీఎం కేసీఆర్ దూరం పాటించాలని నిర్ణయించారు. ప్రస్తుతం విశాఖలో ఉన్న ప్రధాని మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ బీజేపీ నగరశాఖ ఏర్పాటు చేసిన స్వాగత సభలో మాట్లాడుతారు.
మధ్యాహ్నం 2.15 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 3.20 గంటలకు రామగుండం చేరుకుంటారు. అక్కడి నుంచి 3:30 గంటలకు రోడ్డు మార్గంలో రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎ్‌ఫసీఎల్)కు చేరుకుని, రూ.6338 కోట్ల వ్యయంతో పునరుద్ధరించిన ప్లాంట్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అరగంటపాటు ఫ్యాక్టరీని సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం 4:15 గంటలకు ఎన్టీపీసీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుంటారు. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతోపాటు రూ.9500 కోట్ల విలువైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. మొత్తంగా ఆరు గంటలపాటు రాష్ట్రంలో ప్రధాని పర్యటన కొనసాగనుంది. ఇదే సమయంలో గోదావరి ఖనిలో కార్మిక సంఘాలు గో బ్యాక్ అంటూ ప్రధాని పర్యటన వేళ నిర్వహిస్తున్న నిరసనలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని పర్యటనకు దూరంగా ఉండటంలో మరోసారి వివాదాస్పదమవుతోంది. ప్రధాని పర్యటనకు ముందు హైదరాబాద్ లోనూ గో బ్యాక్ మోదీ అంటూ బ్యానర్లు దర్శనమివ్వటం కలకలం రేపింది. కేంద్ర ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించకుండా కార్యక్రమంలో పాల్గొనాలని మాత్రమే లేఖ పంపారని టీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి.
ఈ కారణంగానే సీఎం రావడం లేదని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ హాజరవుతున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి భగవంత్ ఖుబా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రధాని పర్యటనలో పాల్గొంటున్నారు. తెలంగాణలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామల నేపథ్యంలో బేగంపేటలో జరిగే పార్టీ నేతల సమావేశంలో ప్రధాని ఏం వ్యాఖ్యలు చేస్తారు.. పార్టీ నేతలకు ఎటువంటి దిశా నిర్దేశం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం











Click it and Unblock the Notifications