దేశంలోనే అద్భుతమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన ప్రధాని మోదీ!
దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవంతో మరొక మైలురాయి పడింది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డిలు చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేరుగా పాల్గొన్నారు. నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం కావడంతో నేటి నుంచి ఈ రైల్వే టెర్మినల్ లో సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి.
నేటి నుండి చర్లపల్లి రైల్వే టెర్మినల్ సేవలు ప్రారంభం
అత్యాధునిక సౌకర్యాలతో విమానాశ్రయం తరహాలో 413కోట్ల రూపాయలతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను అత్యద్భుతంగా నిర్మించారు. నేటి నుంచి ఈ రైల్వే టెర్మినల్ నుంచి 13జతల రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ టెర్మినల్ అందుబాటులోకి రావడంతో ఇక్కడి నుంచి మరో 12 జతల రైళ్ళను నడిపించేందుకు కూడా రైల్వేశాఖ సన్నద్ధమవుతోంది. ఢిల్లీ, చెన్నై ,విశాఖపట్నం, కోల్ కత్తా రూట్లలో వెళ్లే రైళ్లను చర్లపల్లి మీదుగా నడిపించనున్నట్టు ఇప్పటికే అధికారులు వెల్లడించారు.

చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన మోదీ
దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ రైల్వే టెర్మినల్ ను అత్యద్భుతంగా నిర్మించగా నేడు ప్రధాని ప్రారంభించారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల డిమాండ్ ను నెరవేరుస్తూ ఈనాడు ప్రారంభమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సదుపాయాలతో పాటు మౌలిక వసతులను కల్పిస్తుంది.
కేంద్రమంత్రి బండి సంజయ్ చర్లపల్లి రైల్వే టెర్మినల్ గురించి ఏమన్నారంటే
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేరుగా పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు...చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవం లో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం, సహకారంతో వివిధ ప్రాజెక్టుల అమలుకు పరస్పర సహకారం అందించు కోవాలని సూచించారు.ఇప్పటిదాకా 32 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల కోసం అందించిందని చెప్పారు .
రైల్వే టెర్మినల్ గురించి రాష్ట్రమంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ చర్ల పల్లి రైల్వే టెర్మినల్ నుంచి రవాణా సదుపాయాల మెరుగుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, .కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకోసం ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని కోరారు. పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టుల అమలుకోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టి కృషి చేయాలని సూచించారు.
దేశంలోనే అద్భుత ఆదర్శ టెర్మినల్ అన్న కేంద్ర రైల్వే సహాయ మంత్రి
కేంద్ర రైల్వే శాఖా సహాయ మంత్రి సోమన్న మాట్లాడుతూ రాష్ట్రంలో 2వేల కోట్ల నిధులతో ఆర్ వో బి, ఆర్ యూ బి లను నిర్మించడానికి నిధులు విడుదల చేసిందని...ఇది ప్రధాన మంత్రి రాష్ట్రానికి ఇచ్చిన బహుమానం అని పేర్కొన్నారు...చర్ల పల్లి రైల్వే టెర్మినల్ దేశంలోనే అద్భుత ఆదర్శ టెర్మినల్ కానుందని, ఈ టెర్మినల్ నుంచి వివిధ ప్రాంతాలకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు












Click it and Unblock the Notifications